News April 14, 2025
MLA సింప్లిసిటీ.. సెలూన్‌లో సామాన్యుడిలా క్షవరం!

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంత్ రావు తన సింప్లిసిటీతో మరోసారి అందరినీ ఆకట్టుకున్నారు. హైదరాబాద్‌లో బిచ్కుంద వాసి సురేష్ హెయిర్ సెలూన్‌కు వెళ్లి సామాన్యుడిలా క్షవరం చేయించుకున్నారు. ఈ సమయంలో ఆయన చుట్టూ ఉన్న వారితో సరదాగా మాట్లాడారు. ఎమ్మెల్యే హోదాలో ఉన్నప్పటికీ, ఆయన ఎంతో నిరాడంబరంగా ఉండటం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన సింప్లిసిటీ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
Similar News
News April 17, 2026
ఖమ్మం: ‘డిగ్రీ ప్రవేశాలకు ‘దోస్త్’ నగారా’

డిగ్రీ ప్రవేశాల కోసం ‘దోస్త్’ (DOST) తొలిదశ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు ఎస్ఆర్బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మొహ్మద్ జాకీరుల్లా తెలిపారు. మే 7వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉందని, ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని పేర్కొన్నారు. సందేహాల నివృత్తికి కళాశాల హెల్ప్‌లైన్ కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.
News April 17, 2026
TG కాంగ్రెస్‌ను తలపించేలా విజయ్ మ్యానిఫెస్టో!

TN అసెంబ్లీ ఎన్నికల వేళ నిన్న TVK చీఫ్ విజయ్ ప్రకటించిన <<19667137>>మ్యానిఫెస్టో<<>> TGలో కాంగ్రెస్ పార్టీ హామీలను తలపిస్తోంది. నెలకు 200యూనిట్ల ఉచిత కరెంట్ పథకాన్ని విజయ్ కూడా ప్రకటించారు. పెళ్లైన యువతులకు INC తులం బంగారం ఇస్తామనగా TVK చీఫ్ 8గ్రా. హామీ ఇచ్చారు. రేవంత్ రూ.500కే సిలిండర్ హామీ ఇవ్వగా విజయ్ ఏడాదికి 6 ఫ్రీగా ఇస్తామన్నారు. TG మాదిరే రైతు రుణమాఫీ, మహిళలకు నెలకు రూ.2,500 వంటి హామీలను విజయ్ గుప్పించారు.
News April 17, 2026
ఎచ్చెర్ల: చేపల వేటకు బ్రేక్.. తీరాల్లో నిశ్శబ్దం!

చేపల వేటపై రెండు నెలల నిషేధం అమల్లోకి రావడంతో జిల్లాలోని సముద్ర తీరాలు నిర్మానుష్యంగా మారాయి. ఎచెర్ల మండలంలోని డి.మత్స్యలేశం గ్రామంలో మత్స్యకారులు బోట్లను, వలలను ఒడ్డున సురక్షితంగా ఉంచి ఇతర పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రతి ఏడాది చేపల ప్రత్యుత్పత్తి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిషేధాన్ని అమలు చేస్తోంది. ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.


