News October 22, 2024
MLA కౌశిక్ రెడ్డి రీల్స్.. స్పందించిన యాదగిరిగుట్ట ఈఓ
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద హుజూరాబాద్ MLA కౌశిక్ రెడ్డి రీల్స్ చేయడంపై ఆలయ ఈఓ భాస్కర్ రావు స్పందించారు. ఆలయం వద్ద భక్తుల మనోభావాలు, భక్తుల విశ్వాసం దెబ్బతినే విధంగా వ్యక్తిగత ఫొటో, వీడియో చిత్రీకరణ చేయవద్దంటూ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఒక MLAగా ఆలయ దర్శనం, తగిన గౌరవం ఇస్తామని తెలిపారు. అందరి మాదిరిగా ఆలయం బయట మాత్రమే ఫొటోలు దిగే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
Similar News
News November 24, 2024
వివరాలు ఫోన్ ద్వారా సేకరించాలి: ఉప ముఖ్యమంత్రి భట్టి
డోర్ లాక్, వలస వెళ్లిన వారి వివరాలు ఫోన్ ద్వారా సేకరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదివారం కలెక్టర్‌తో మాట్లాడారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరికి దశకు చేరుకుందని, సర్వే డాటా ఎంట్రీ చాలా కీలకమైనదని, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వవద్దని ఆయన స్పష్టం చేశారు.
News November 24, 2024
మంథని: కోటి దీపోత్సవంలో శ్రీధర్ బాబు
హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన కోటి దీపోత్సవ కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. కోటి దీపోత్సవంలో పాల్గొనడం దివ్యానుభూతి ఇచ్చిందన్నారు. కార్తీకమాస పూజల్లో భాగంగా సీతారాముల కళ్యాణంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంత పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అపూర్వంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ నిర్వాహకులను అభినందించారు.
News November 24, 2024
జగిత్యాల: మత్స్యకారుడి వలకు చిక్కిన అరుదైన చేప
జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువులో చేపల వేటకు వెళ్లిన గంగ పుత్రులకు ఓ అరుదైన చేప చిక్కింది. సక్కరమౌత్ క్యాట్ ఫిష్ అనే అరుదైన చేప తులసినగర్‌కి చెందిన గంగపుత్రుడు నవీన్ వలకు చిక్కింది. ఈ చేపను మార్కెట్లోకి అమ్మకానికి తీసుకు రావడంతో అంతా ఆసక్తిగా తిలకించారు. ఇవి ఎక్కువగా ఉష్ణ మండలంలోని మంచినీటిలో ఉంటాయని నవీన్ తెలిపారు.