News October 13, 2025

MLA చెబితేనే వినుత బెడ్ రూంలో కెమెరా పెట్టాడు: YCP

image

MLA సుధీర్ చెబితేనే <<17986475>>వినుత బెడ్ రూం<<>>లో రాయుడు కెమెరా పెట్టాడని ‘X’ వేదికగా YCP ఆరోపించింది. ‘రాయుడు వినుత బెడ్రూంలో ఫోన్ పెట్టాడు. ఆమె డ్రెస్ మార్చుకుంటుండగా రింగ్‌టోన్ మోగడంతో వీడియో రికార్డవుతున్నట్లు గుర్తించింది. దొరికిపోయానంటూ రాయుడు బొజ్జల అనుచరుడు సుజిత్, చంద్రకు ఫోన్ చేశాడు. “తమ్ముడు తప్పించుకో.. మా పేర్లు చెబితే నీ ఫ్యామిలీని చంపేస్తాం” అంటూ వారు బెదిరించారు’ అని YCP ఆరోపించింది.

Similar News

News October 13, 2025

పల్నాడులో ఆ మున్సిపాలిటీకి అత్యధిక ఆదాయం

image

పల్నాడు జిల్లాలో నరసరావుపేటకు అత్యధిక ఆదాయం పన్నుల రూపంలో ఈ ఏడాది రూ.89 లక్షలు సమకూరింది. మున్సిపాలిటీలు స్వయం ప్రతిపత్తిని సాధించాలనే రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఆస్తి పన్నులపై ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దీంతో మాచర్లకు రూ. 36 లక్షలు, సత్తెనపల్లికి రూ. 29లక్షలు, పిడుగురాళ్లకు రూ. 26 లక్షలు, గురజాలకు రూ. 12 లక్షలు ఆదాయం లభించింది. పన్నుల విధానంపై ఇంటింటి సర్వేతో సాధ్యమైందని అధికారులంటున్నారు.

News October 13, 2025

ఇంటింటి సర్వేతో మున్సిపాలిటీల్లో పెరిగిన ఆదాయం

image

పన్నులు పెంచకుండా ఆదాయం పెంచుకోవాలని మున్సిపాలిటీలు సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇంటింటి పన్నుల పరిశీలన చేపట్టారు. ఇప్పటివరకు పన్నులు వేయని ఆస్తులు, తక్కువ మొత్తంలో పన్నులు చెల్లిస్తున్న ఆస్తులను గుర్తించి ఇంటింటి సర్వే చేపట్టారు. దీంతో పన్నుల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. గుంటూరు: 460, మంగళగిరి: 397, తెనాలి: 84, పొన్నూరు: 31, లక్షల్లో ఆదాయం సమకూరింది.

News October 13, 2025

NLG: నీటి సంఘాలకు ఎన్నికలు లేక 17 ఏళ్లు!

image

జిల్లాలో సుదీర్ఘకాలంగా నీటి సంఘాలకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడంతో చెరువులు అధ్వానంగా మారుతున్నాయి. 2006లో ఉమ్మడి ఏపీలో వందెకరాల ఆయకట్టుకుపైగా ఉన్న ప్రధాన చెరువులకు సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించారు. వాటి కాలపరిమితి 2008లో ముగిసినా నేటి వరకు ఎన్నికలు నిర్వహించలేదు. గత ప్రభుత్వం చెరువులు, కుంటలకు మరమ్మతులు చేసిన వాటిపై ఆజమాయిషి లేక నీటి విడుదల, మరమ్మతులపై దృష్టి పెట్టేవారు కరువయ్యారు.