News November 7, 2024

గెలిపిస్తే బ్యాచిలర్స్‌కు పెళ్లిళ్లు చేస్తానన్న MLA అభ్యర్థి

image

మహారాష్ట్ర ఎన్నికల్లో నేతలు విచిత్రమైన హామీలు ఇస్తున్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గంలోని బ్యాచిలర్స్‌కు పెళ్లిళ్లు చేయించి జీవనోపాధి కల్పిస్తానని పర్లీ NCP (SCP) అభ్యర్థి రాజాసాహెబ్ దేశ్‌ముఖ్ హామీ ఇవ్వడం వైరల్‌గా మారింది. మంత్రి, తన ప్రత్యర్థి ధనంజయ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఉపాధి కల్పించకపోవడంతో వారికి పెళ్లిళ్లు కావడం లేదని విమర్శించారు. దీనిపై మీడియా వివరణ కోరగా దేశ్‌ముఖ్ అందుబాటులోకి రాలేదు.

Similar News

News November 1, 2025

పేపర్, TV ద్వారా శవరాజకీయాలు చేస్తే తీవ్ర పరిణామాలు: CBN

image

AP: YCP ఓ ఫేక్ పార్టీ అని CBN విమర్శించారు. ‘ఆ పార్టీకి ఏం దొరకడం లేదు. ఏ ప్రమాదం జరిగినా ఫేక్ ప్రచారం చేస్తున్నారు. కర్నూలు బస్సు ప్రమాదంపైనా దుష్ప్రచారం చేశారు. YCPకి ఓ పాంప్లెట్, ఛానెల్ ఉన్నాయి. వాటితో శవరాజకీయం చేస్తోంది. కమ్మ, కాపు మధ్య విద్వేషాలు రగిలించేందుకు యత్నిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. వీటిపై తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. రాజకీయాల్లో ఉండే అర్హత వారికి లేదన్నారు.

News November 1, 2025

కార్తీక శుద్ధ ఏకాదశి: ఎంత శుభప్రద దినమంటే?

image

కార్తీక శుద్ధ ఏకాదశి ఎంత పవిత్ర దినమో బ్రహ్మ, నారదులు వివరించారు. ఈరోజున ఏకాదశి వ్రతం చేస్తే.. పాపాలు పూర్తిగా తొలగి, 1000 అశ్వమేధ, 100 రాజసూయ యాగాల పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. కొండంత పత్తిని ఓ నిప్పు రవ్వ కాల్చినట్లుగా.. ఈ ఉపవాస వ్రతం వేల జన్మల పాపాలను దహించివేస్తుందని నమ్మకం. చిన్న పుణ్య కార్యమైనా పర్వత సమాన ఫలాన్నిస్తుందట. ఈ వ్రతం చేస్తే.. సాధించలేనిదంటూ ఉండదని బ్రహ్మ వివరించాడు.

News November 1, 2025

ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా ‘కల్కి’

image

ముంబై వేదికగా దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(DPIFF)-2025 వైభవంగా జరిగింది. ప్రభాస్ నటించిన ‘కల్కి 2898AD’ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా, ‘స్త్రీ-2’ బెస్ట్ మూవీలుగా నిలిచాయి. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిశ్రీ ప్రసాద్(పుష్ప-2), బెస్ట్ యాక్టర్‌గా కార్తీక్ ఆర్యన్, బెస్ట్ యాక్ట్రెస్‌గా కృతి సనన్‌, బెస్ట్ డైరెక్టర్‌గా కబీర్‌ఖాన్‌కు అవార్డులు దక్కాయి.