News January 22, 2025

MLAకు గుండెపోటు.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే?

image

TG: గుండెపోటుకు గురైన BRS ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. కుటుంబంతో సహా డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న ఆయన 2 రోజుల క్రితం గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, డాక్టర్లు స్టంట్ వేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలియడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.

Similar News

News January 22, 2026

మాపై అధిక పన్నులు వేయండి.. బిలియనీర్ల లేఖ

image

తమపై అధిక పన్నులు వేయాలంటూ 24 దేశాలకు చెందిన కుబేరులు దావోస్‌లో రిలీజ్ చేసిన లేఖ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ‘టైమ్ టు విన్.. వియ్ మస్ట్ విన్ బ్యాక్ అవర్ ఫ్యూచర్. లీడర్స్ ఎట్ దావోస్ టాక్స్ ది సూపర్ రిచ్’ అనే హెడ్డింగ్‌తో లేఖ రాశారు. దీనిపై 400 మంది సూపర్ రిచ్ పీపుల్ సంతకాలు చేశారు. పేదలు, అత్యంత సంపన్నుల మధ్య నానాటికీ పెరిగిపోతున్న దూరాన్ని తగ్గించడానికి తమలాంటి వారిపై అధిక పన్నులు వేయాలని కోరారు.

News January 22, 2026

బెండ, టమాటా, వంగ పంటల్లో తెగుళ్ల నివారణ

image

ఈ సీజన్‌లో కూరగాయ పంటల్లో వైరస్ తెగుళ్ల వ్యాప్తిని అరికట్టేందుకు రసం పీల్చే పురుగులను నివారించాలి. ఇందుకోసం ఫాసలోన్ లేదా ఫిప్రోనిల్ మందులను లీటరు నీటికి 2ML చొప్పున కలిపి పిచికారీ చేయాలి. తెల్ల దోమ నివారణకు 1.5గ్రా. ఎసిఫేట్‌ను లీటరు నీటికి కలిపి, కాయతొలుచు పురుగు నివారణకు 2ML ప్రొఫెనోఫాస్ లీటరు నీటికి కలిపి స్ప్రే చేయాలి. అలాగే అధికారుల సిఫారసు మేరకు నత్రజని ఎరువులను వేసుకుని నీరు పెట్టుకోవాలి.

News January 22, 2026

ఎండిన వారికి ఇనుము తిండి

image

తీవ్రమైన ఆకలితో శరీరం బలహీనంగా, ఎండిపోయి ఉన్న వ్యక్తికి ఇనుము ముక్కలను ఆహారంగా ఇస్తే ఎలా ఉంటుంది? ఇనుము తినడానికి పనికిరాదు, అది వారికి బలం ఇవ్వదు సరికదా, ప్రాణం పోయే ప్రమాదం ఉంది. ఏదైనా ఒక సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు దానికి ఉపశమనం కలిగించే పరిష్కారాన్ని సూచించాలి, అంతే తప్ప ఆ పరిస్థితిని మరింత దిగజార్చే పరిష్కారాన్ని సూచించకూడదని తెలిపే సందర్భంలో ఈ సామెత వాడతారు.