News September 25, 2024
MLA ఆదిమూలానికి భారీ ఊరట

AP: సత్యవేడు MLA కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో భారీ ఊరట దక్కింది. ఆయనపై నమోదైన లైంగిక వేధింపుల <<14026695>>కేసును <<>>హైకోర్టు కొట్టేసింది. ఈ కేసును కొట్టేయాలని MLA ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదు చేసిన మహిళ కోర్టుకు హాజరై తాను చేసిన ఆరోపణలు, FIRలో అంశాలన్నీ అవాస్తవమని, కేసును కొట్టేయాలని న్యాయమూర్తికి వివరించారు. ఈ అంశాలు పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈ కేసును కొట్టేసింది.
Similar News
News December 4, 2025
చంద్రుడికి అర్ఘ్యం ఎలా సమర్పించాలి?

అర్ఘ్యం ఇవ్వడానికి ముందుగా రాగి పాత్ర తీసుకోవాలి. అందులో శుభ్రమైన నీరు, కొద్దిగా పాలు పోయాలి. అక్షతలు, పూలు వేయాలి. దాన్ని 2 చేతులతో పట్టుకుని, చంద్రుడిని చూస్తూ నిలబడాలి. చంద్రుడి మంత్రాలు చదువుతూ.. ఆ నీటిని కిందకు ప్రవహించేలా నెమ్మదిగా పోయాలి. ఇలా చేయడం చంద్రుడి అనుగ్రహంతో ఆరోగ్యం, అదృష్టం మెరుగుపడతాయని ప్రగాఢ విశ్వాసం. అలాగే మానసిక ప్రశాంతత లభిస్తుందని, మనస్సు స్థిరంగా ఉంటుందని నమ్మకం.
News December 4, 2025
నేడు ఆదిలాబాద్లో సీఎం రేవంత్ పర్యటన

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆదిలాబాద్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో రూ.500 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని మాట్లాడతారు. కాగా జిల్లాకు ఎయిర్పోర్టుపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. సీఎం పర్యటన నేపథ్యంలో 700 మంది పోలీసులతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.
News December 4, 2025
సహజ ప్రసవాలు పెంచేందుకు ప్రత్యేక శిక్షణ

AP: సహజ ప్రసవాలు పెంచేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలకు సిద్ధమైంది. ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే గైనకాలజిస్టులకు ‘అసిస్టెడ్ వెజైనల్ డెలివరీ’ విధానంపై శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. వాక్యూం ఎక్ట్ర్సాక్షన్, ఫోర్సెప్స్తో సహజ ప్రసవాలు ఎలా చేయవచ్చో వివరిస్తామన్నారు. ఈ నెల 10 నుంచి 6 నెలల పాటు నిర్దేశించిన తేదీల్లో కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు.


