News January 14, 2025

ఎమ్మెల్యే కౌశిక్‌కు బెయిల్ మంజూరు

image

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. ఆయన రిమాండ్ రిపోర్టును జడ్జి కొట్టేశారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో గందరగోళం సృష్టించారని, ఎమ్మెల్యే సంజయ్‌ను దుర్భాషలాడారని 3 కేసులు నమోదు కాగా నిన్న పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం వైద్య పరీక్షలు చేసి, కోర్టు ముందు హాజరుపరచగా జడ్జి బెయిల్ ఇచ్చారు. రూ.10 వేల చొప్పున 3 పూచీకత్తులు ఇవ్వాలని ఆదేశించారు.

Similar News

News January 14, 2025

మహా కుంభమేళాలో విషాదం

image

మహా కుంభమేళాలో విషాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన NCP(SP) నేత, షోలాపూర్ మాజీ మేయర్ మహేశ్ కొతె గుండెపోటుతో మరణించారు. ఇవాళ ఉదయం త్రివేణి సంగమం వద్ద నదిలో పవిత్ర స్నానం చేసేందుకు వెళ్లిన ఆయన అక్కడే గుండెపోటుకు గురయ్యారు. గమనించి తోటి భక్తులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మహేశ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

News January 14, 2025

హ‌రియాణా BJP చీఫ్‌పై గ్యాంగ్ రేప్ కేసు

image

హ‌రియాణా BJP చీఫ్ మోహ‌న్ లాల్ బ‌డోలీపై హిమాచ‌ల్ పోలీసులు సామూహిక అత్యాచారం కేసు న‌మోదు చేశారు. HPలోని కసౌలిలో ఉన్న హోట‌ల్‌లో July 3, 2023న మోహ‌న్ లాల్, సింగ‌ర్ రాఖీ మిట్ట‌ల్ తనపై అత్యాచారం చేశార‌ని ఢిల్లీకి చెందిన బాధితురాలు ఆరోపించారు. ప్ర‌భుత్వ ఉద్యోగం ఇప్పిస్తాన‌ని, మ్యూజిక్ వీడియోలో అవ‌కాశం ఇస్తాన‌ని నమ్మించిన వీరిద్దరూ దారుణానికి ఒడిగట్టారన్నారు. అయితే ఆమె ఎవరో తెలియదని మోహన్ లాల్ అన్నారు.

News January 14, 2025

నేషనల్ పాలిటిక్స్‌పైనే INDIA ఫోకస్: ప‌వార్‌

image

INDIA కూట‌మి కేవ‌లం జాతీయ రాజ‌కీయాలపై దృష్టిసారిస్తుంద‌ని, అసెంబ్లీ-స్థానిక ఎన్నిక‌ల‌పై కూట‌మిలో ఎలాంటి చ‌ర్చ లేద‌ని NCP SP చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ పేర్కొన్నారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఒంటరిగా పోటీ చేయాలా? క‌లిసి పోటీ చేయాలా? అనేది త్వ‌ర‌లో నిర్ణ‌యిస్తామ‌న్నారు. అయితే, ఒంటరిగా పోటీ చేయ‌నున్న‌ట్టు శివ‌సేన UBT ఇప్పటికే ప్ర‌క‌టించింది. స్థానిక ఎన్నిక‌లు MVA పార్టీల‌కు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌గా ప‌రిణ‌మించాయి.