News October 23, 2025
MLA కొలికపూడి vs MP కేశినేని చిన్ని

AP: MP కేశినేని చిన్నీపై తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర ఆరోపణలు చేశారు. MLA టికెట్ కోసం MPకి రూ.5 కోట్లు ఇచ్చానంటూ బ్యాంక్ స్టేట్మెంట్‌ను వాట్సాప్ స్టేటస్ పెట్టారు. ‘తిరువూరులో దొంగే దొంగని అరుస్తున్నాడు. ఆరోపణలపై సాక్ష్యాలు ఇవ్వాలి. నేను సంపాదించుకోవాలనుకుంటే తిరువూరు దాకా వెళ్లక్కర్లేదు’ అని చిన్ని తెలిపారు. ఈ వివాదంపై MP, MLAని పల్లా శ్రీనివాసరావు రేపు NTR భవన్‌కు పిలిచారు.
Similar News
News October 23, 2025
‘మీ తాత కూడా ఇండియా నుంచే వచ్చాడు..!’

సామూహిక వలసలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ US రిపబ్లికన్ నేత నిక్కీ హెలీ కొడుకు నలిన్ హేలీ చేసిన ట్వీట్ చర్చకు దారితీసింది. వలసలతో US పౌరులకు ఉద్యోగాలు లభించడంలేదన్నారు. దీంతో అతడికి బ్రిటీష్-అమెరికన్ జర్నలిస్ట్ మెహదీ హసన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘మీ తాత కూడా ఇండియా నుంచే వచ్చారు’ అని నలిన్‌కు గుర్తుచేశారు. నిక్కీ హెలీ తండ్రి అజిత్ సింగ్ రంధవా 1969లో అమెరికాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.
News October 23, 2025
ఇండియా టెక్ డెస్టినేషన్‌గా ఏపీ: CM CBN

డేటా సెంటర్లు, AI మెషీన్ లెర్నింగ్, ఫిన్‌టెక్, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ గవర్నెన్సు వంటి రంగాల్లో పెట్టుబడులకు AP ఎంతో అనుకూలమని CM CBN తెలిపారు. ఇండియా టెక్ డెస్టినేషన్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామన్నారు. UAE టెక్ కంపెనీలతో కలిసి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. అబుదబీలో నెట్వర్క్ లంచ్‌లో పాల్గొన్న ఆయన ఆ దేశ ఛాంబర్ ఛైర్మన్, ADNOC గ్లోబల్ ట్రేడింగ్ ప్రతినిధులతో భేటీ అయ్యారు.
News October 23, 2025
తేలని ‘స్థానిక’ అంశం!

TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తదుపరి సమావేశంలో చర్చిద్దామని CM రేవంత్ చెప్పినట్లు సమాచారం. BCలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడింది. అయితే NOV 3న HC తీర్పు ఉండటంతో 7న మరోసారి భేటీ కావాలని సీఎం నిర్ణయించారు. ఆ రోజు రిజర్వేషన్లు, ఎలక్షన్స్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.