News February 11, 2026
MLA, MLCల కుటుంబాలతో లోకేశ్ డిన్నర్!

AP: రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సంప్రదాయానికి తెరలేవనుంది. MLA, MLC కుటుంబాలతో మంత్రి లోకేశ్ ఆత్మీయ విందులో పాల్గొనాలని యోచిస్తున్నారు. ప్రతిరోజూ ఏడుగురు MLAలు, MLCలతో ఆయన భేటీ కానున్నారు. సభ్యులతో పాటు వారి ఫ్యామిలీ మెంబర్స్‌తో ఇష్టాగోష్టిగా మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకోనున్నారు. ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ ముగిసేలోపు ఈ ప్రోగ్రాం పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Similar News
News February 15, 2026
భారత్-పాక్ మ్యాచ్.. వర్షానికి 70% ఛాన్స్!

కొలంబోలో ఈ రాత్రి జరగనున్న భారత్-పాక్ T20 WC మ్యాచ్‌పై వరుణుడి నీడ కమ్ముకొంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా 70% వర్షం కురిసే అవకాశం ఉందని శ్రీలంక వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా మ్యాచ్ ప్రారంభానికి ముందు (సాయంత్రం 6-7 గంటల మధ్య) భారీ వర్షం, ఆ తర్వాత జల్లులు పడే ఛాన్స్ ఉంది. ఈ పరిస్థితుల్లో మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉంది. లేదా ఓవర్లను భారీగా తగ్గించాల్సి రావచ్చు.
News February 15, 2026
జనసేన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే కావాలి: పవన్

AP: జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ప్రారంభించారు. రూ.2 కోట్ల విరాళం అందించి తొలి సభ్యత్వాన్ని తీసుకున్నారు. 150 మందితో పార్టీని ప్రారంభించగా 2024 ఎన్నికల తర్వాత అది 12.98 లక్షలకు చేరుకుందని పవన్ చెప్పారు. జనసేన భావజాలాన్ని అర్థం చేసుకొని, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే పార్టీకి అవసరమని వ్యాఖ్యానించారు.
News February 15, 2026
ఉపవాసాలు – రకాలు.. మీది ఏ రకం?

ఉపవాసాలు 5 రకాలు. అందులో మొదటిది, కఠినమైనది నిర్జల ఉపవాసం. ఇందులో నీరు కూడా తాగరు. రెండో రకం జల ఉపవాసం. ఇందులో నీటిని మాత్రమే తాగుతారు. ఇక మూడోది ద్రవ ఉపవాసం. ఇందులో కొబ్బరినీళ్లు వంటి పానీయాలు తీసుకోవచ్చు. నాలుగోది ఫలోపవాసం. ఇందులో పాలతో పాటు పండ్లు కూడా తీసుకోవచ్చు. ఇక చివరిది సాత్విక ఉపవాసం. ఇందులో సగ్గుబియ్యం వంటి తేలికపాటి ఆహారం తీసుకోవచ్చు. ఇందులో మీది ఏ ఉపవాసం? COMMENT


