News May 22, 2024
ఎమ్మెల్యే పిన్నెల్లిపై అనర్హత వేటు వేయాలి: బ్రహ్మారెడ్డి

AP: ఈవీఎంను ధ్వంసం చేసిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై అనర్హత వేటు వేయాలని మాచర్ల టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి డిమాండ్ చేశారు. మాచర్లలో పథకం ప్రకారమే పిన్నెల్లి దాడులకు పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డీజీపీకి వినతిపత్రం ఇచ్చారు. ఈవీఎంను ధ్వంసం చేస్తుండగా అడ్డుకునేందుకు యత్నించిన టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై ఎమ్మెల్యే రౌడీలతో దాడి చేయించడం దుర్మార్గమన్నారు.
Similar News
News November 8, 2025
APSRTCలో 277 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

APSRTCలో 277 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. కర్నూలు(46), నంద్యాల(43), అనంతపురం(50), శ్రీ సత్యసాయి(34), కడప(60), అన్నమయ్య(44) జిల్లాలో ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ITI అర్హతగల అభ్యర్థులు www.apprenticeshipindia.gov.inలో నమోదు చేసుకున్న తర్వాత వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులను విద్యార్హతలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: apsrtc.ap.gov.in/
News November 8, 2025
ఆవులు, గొర్రెల మందలను పొలాల్లో ఉంచితే లాభమేంటి?

కొందరు రైతులు పంట కోత తర్వాత లేదా మరో పంట నాటే ముందు గొర్రెలు, ఆవుల మందలను పంట పొలాల్లో కట్టడం, ఉంచడం చూస్తుంటాం. దీని వల్ల లాభాలున్నాయ్. ఆ పశువుల మూత్రం, పేడ, గొర్రెల విసర్జితాల వల్ల భూమిలో, పంటకు మేలుచేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది. భూమికి క్షారత్వం తగ్గి.. సారం పెరుగుతుంది. ఫలితంగా పంట నాణ్యత, దిగుబడులు పెరుగుతాయి. తర్వాతి పంటకు ఎరువులపై పెట్టే ఖర్చు 30 నుంచి 40 శాతం తగ్గించుకోవచ్చు.
News November 8, 2025
చరిత్ర సృష్టించిన ఉమెన్స్ వరల్డ్ కప్

ఇటీవల ముగిసిన ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ డిజిటల్ వ్యూయర్షిప్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లను జియో హాట్‌స్టార్‌లో 446 మిలియన్ల మంది వీక్షించినట్లు సంస్థ ప్రకటించింది. ఉమెన్ క్రికెట్లో ఇదే అత్యధికమని, 3 వరల్డ్ కప్‌ల టోటల్ వ్యూయర్షిప్ కంటే ఎక్కువని పేర్కొంది. అలాగే భారత్-సౌతాఫ్రికా ఫైనల్‌ను 185 మిలియన్ల మంది చూశారని వివరించింది. ఇది 2024 మెన్స్ T20WC ఫైనల్‌తో సమానమని వెల్లడించింది.


