News September 15, 2024

ఎమ్మెల్యేలు రోడ్డెక్కి తన్నుకోవడం బాధ కలిగించింది: భట్టి

image

TG: కౌశిక్‌రెడ్డి, అరెకపూడి గాంధీ వ్యవహారంపై dy.cm భట్టి విక్రమార్క స్పందించారు. బాధ్యతగల MLAలు రోడ్డెక్కి తన్నుకోవడం బాధ కలిగించిందన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. BRS ప్రభుత్వం ప్రతిపక్ష హోదా లేకుండా CLP సీటును సైతం లాగేసుకుందని, తాము వారిలా ప్రవర్తించడం లేదని చెప్పారు. అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు వినిపించాలని కోరుకుంటున్నామని తెలిపారు.

Similar News

News September 18, 2024

జమిలి ఎన్నికలకు మేం వ్యతిరేకం: ఖర్గే

image

జమిలి ఎన్నికలకు తాము వ్యతిరేకమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో జమిలి ఎన్నికలు అసాధ్యమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకించారు. జమిలి ఎన్నికలకు ఎట్టి పరిస్థితుల్లో తమ మద్దతు ఉండబోదని ప్రకటించారు. మల్టిపుల్ ఎన్నికలు నిర్వహించడంలో మోదీ, అమిత్ షాలకు ఏమైనా అభ్యంతరమా? అని ఆయన ప్రశ్నించారు.

News September 18, 2024

జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు.. స్పందించిన అనసూయ

image

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచార ఆరోపణలపై సినీ నటి అనసూయ స్పందించారు. ‘‘పుష్ప’ సెట్స్‌లో ఆ అమ్మాయిని చూశా. తను చాలా టాలెంటెడ్. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఆమె ప్రతిభను ఏమాత్రం తగ్గించలేవు. బాధితురాలికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదురైతే భయపడాల్సిన అవసరం లేదు. మనసులో దాచుకోకుండా వెంటనే బయటపెట్టాలి. అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం ఉండాలి’ అని ఆమె పేర్కొన్నారు.

News September 18, 2024

మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్: నారా లోకేశ్

image

AP: మాజీ సైనికుల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. యువగళం పాదయాత్రలో సైనికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించినట్లుగానే ఆయన హామీ నెరవేర్చారు. ఇవాళ జరిగిన క్యాబినెట్ భేటీలో దీనిపై తీర్మానం చేశారు. ఇంకా నెరవేర్చాల్సిన హామీలపై ఆయన వివిధ శాఖల మంత్రులతో చర్చలు జరుపుతున్నారు.