News November 12, 2024

MLAలు ప్రజలతో మమేకం కావాలి: CM

image

AP: NDA MLAలంతా ప్రజలతో మమేకం కావాలని CM చంద్రబాబు కోరారు. NDA శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘2029లో మీ అందరినీ MLAలుగా మళ్లీ గెలిపించుకోవాలనుకుంటున్నా. MLA ఛైర్మన్‌గా ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తాం. స్థానిక టూరిజం అభివృద్ధికి MLAలు డాక్యుమెంట్ సిద్ధం చేయాలి. ఉచిత ఇసుక విధానం మీరే సక్రమంగా అమలు చేయాలి. సమస్యలు నా దృష్టికి తెస్తే చర్యలు తీసుకుంటా’ అని వెల్లడించారు.

Similar News

News November 14, 2024

CRICKET: వింత కారణాలు.. నిలిపివేతలు!

image

క్రికెట్ మ్యాచ్‌లు ప్రధానంగా వర్షం, వెలుతురు సరిగా లేకపోవడం వల్ల ఆలస్యం లేదా నిలిచిపోతుంటాయి. సౌతాఫ్రికాలో ఇండియా తాజాగా ఆడిన టీ20 పురుగుల వల్ల కాసేపు నిలిచిపోయింది. SAలోనే 2017లో తేనెటీగల దాడి వల్ల శ్రీలంకతో మ్యాచ్, 2017లో హలాల్ ఫుడ్ అందుబాటులో లేదని బంగ్లాదేశ్‌తో మ్యాచ్ నిలిచిపోయాయి. వీటన్నింటికంటే వింతగా పాకిస్థాన్‌లో 1996లో PCB బంతులు సప్లై చేయకపోవడంతో NZతో టెస్టు 20ని.లు ఆలస్యమైంది.

News November 14, 2024

ఇద్దరికి మించి పిల్లలున్న వారూ అర్హులే

image

AP: ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇకపై అర్హులే. దానికి సంబంధించిన నిబంధనకు సవరణ చేస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది. అప్పట్లో కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా 1994లో ఇద్దరికంటే ఎక్కువ మంది సంతానం ఉన్న వారిని ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా గుర్తిస్తూ చట్టం చేశారు. ఇప్పుడు సంతానోత్పత్తి తగ్గడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

News November 14, 2024

వర్మాజీ & శర్మాజీ

image

సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత యువ బ్యాటర్లు తిలక్‌వర్మ, అభిషేక్‌శర్మ అదరగొట్టారు. తిలక్ 107(56 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు), అభిషేక్ 50(25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగులతో సఫారీ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. దీంతో సూర్య(1), హార్దిక్(18) వంటి సీనియర్లు పెద్దగా రాణించకపోయినా <<14604651>>భారత్<<>> మంచి స్కోర్(219/6) చేసింది. దీంతో ఈ ఇద్దరు యువ బ్యాటర్లపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురుస్తున్నాయి.