News November 22, 2024
అసెంబ్లీలో ఓట్లు నమోదు చేస్తున్న MLAలు

AP: అసెంబ్లీలో PAC, PUC, అంచనాల కమిటీల్లో సభ్యుల ఎన్నిక కొనసాగుతోంది. MLAలు బ్యాలెట్ పద్ధతిలో ఓట్లు నమోదు చేస్తున్నారు. మధ్యాహ్నం 2గంటల వరకు కమిటీ హాలులో జరగనున్న ఈ ఎన్నిక ప్రక్రియ బాధ్యతను విప్లకు అప్పగించారు. పబ్లిక్ అకౌంట్స్(PAC) కమిటీని ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. PACలో సభ్యుడు కావాలంటే కనీసం 18 ఓట్లు కావాల్సి ఉండగా, YCPకి 11ఓట్లే ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నిక ఆసక్తికరంగా మారింది.
Similar News
News December 4, 2025
SIDBIలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(<
News December 4, 2025
నేడు ఇలా చేస్తే.. సిరి సంపదలకు లోటుండదు: పండితులు

నేడు మార్గశిర పౌర్ణమి, గురువారం కలిసి వచ్చిన అత్యంత పవిత్రమైన రోజు. ఈ శుభ దినాన కొన్ని పూజలు, పనులు చేయడం వల్ల సిరిసంపదలకు లోటుండదని పండితులు అంటున్నారు. పేదలకు అన్నదానం, దాన ధర్మాలు చేస్తే మానసిక ప్రశాంతత, శ్రేయస్సు కలుగుతాయంటున్నారు. ‘సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించినా, విన్నా కూడా శుభం కలుగుతుంది. దీపారాధన చేయవచ్చు. ఇష్టదైవానికి శనగలు నైవేద్యంగా సమర్పించాలి’ అని సూచిస్తున్నారు.
News December 4, 2025
S-500 గురించి తెలుసా?

రష్యా నుంచి దిగుమతి చేసుకున్న S-400 డిఫెన్స్ సిస్టమ్ ‘ఆపరేషన్ సిందూర్’లో గేమ్ ఛేంజర్గా మారింది. దీంతో దాని కంటే శక్తిమంతమైన S-500ను కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. S-400 సిస్టమ్ 400కి.మీ దూరంలోని టార్గెట్లను మాత్రమే షూట్ చేయగలదు. కానీ S-500 రేంజ్ 600 కి.మీ కావడం విశేషం. హైపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైళ్లు, లో ఆర్బిట్ శాటిలైట్లను నాశనం చేయగలదు. ఒక్క యూనిట్ ధర సుమారు రూ.20,800కోట్ల వరకు ఉంటుంది.


