News August 17, 2024

MLCగా బొత్సకు మూడేళ్లే అవకాశం..!

image

ఎమ్మెల్సీ పదవీ కాలం ఆరేళ్లు ఉంటుంది. కానీ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స సత్యనారాయణ మూడేళ్ల తర్వాత మాజీ అవుతారు. దీనికి ప్రధాన కారణం ఉపఎన్నిక. వైసీపీ ఎమ్మెల్సీగా ఎన్నికైన వంశీకృష్ణ జనసేనలో చేరడంతో ఆయనపై అనర్హత వేటు పడింది. ఈక్రమంలోనే ఉపఎన్నిక వచ్చింది. నిబంధనల ప్రకారం ముందుగా ఎన్నికైన వ్యక్తి ఆరేళ్లలో ఎన్నిరోజులు పదవిలో ఉంటారో అవి మినహాయించి కొత్త వ్యక్తి పదవీకాలం ఉంటుంది.

Similar News

News November 19, 2025

జిల్లాలో పర్యటించనున్న షెడ్యూల్డ్ కులాల కమీషన్: కలెక్టర్

image

ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ జవహర్ ఆధ్వర్యంలో కమిటీ జిల్లాలో శుక్రవారం పర్యటించనుంది. కలెక్టర్ రాం సుందర్ రెడ్డి వివరాల ప్రకారం.. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్‌లో షెడ్యూల్డ్ కుల సంఘాల ప్రతినిధులు, ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.

News November 19, 2025

జిల్లాలో 2.27 లక్షల మంది రైతులకు లబ్ది: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటోందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అన్నారు. వేపాడ తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో జరిగిన అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే లలిత కుమారి కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. అధిక వర్షాలు నమోదవడం వల్ల జిల్లాలో వరి పంటకు మంచి దిగుబడి వచ్చిందని తెలిపారు. జిల్లాలో 2.27 లక్షల మంది రైతులకు రూ.150 కోట్లు జమచేశామన్నారు.

News November 19, 2025

ఉత్త‌రాంధ్ర‌లో అంచ‌నాల కమిటీ ప‌ర్య‌ట‌న‌

image

AP అంచ‌నాల క‌మిటీ ఈనెల 25-29 వ‌రకు ఉత్త‌రాంధ్రలో ప‌ర్య‌టించ‌నుంది. ఛైర్మ‌న్ వేగుళ్ల జోగేశ్వ‌రరావు అధ్య‌క్ష‌త‌న క‌మిటీ స‌భ్యులు 25న విశాఖ‌ చేరుకుంటారు. 26న పలు సమీక్షల అనంతరం విజయనగరం చేరుకొని రామనారాయ‌ణాన్ని సందర్శిస్తారు. 27న పైడిత‌ల్లమ్మని ద‌ర్శించుకొని క‌లెక్ట‌రేట్లో అధికారుల‌తో స‌మావేశ‌మవుతారు. 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రాల్లో జ‌రిగిన ప‌నుల‌కు సంబంధించిన అంశాల‌పై స‌మీక్షిస్తారు.