News March 25, 2024

MLC ఉపఎన్నికలో పాల్గొనే అధికారులకు కలెక్టర్ సూచనలు

image

✓ ఉపఎన్నిక EVMల ద్వారా కాకుండా బ్యాలెట్‌ విధానంలో ఉంటుంది.
✓ బ్యాలెట్‌ బాక్స్‌ ఖాళీగా ఉందని అభ్యర్థులకు, వారి ఏజెంట్లకు చూపాలి.
✓ బ్యాలెట్‌ బాక్సులు ఓపెన్‌ చేయడం, మూసివేయడం, సీలింగ్‌ చేసే పద్ధతి గురించి తెలుసుకోవాలి.
✓ బ్యాలెట్‌ పేపర్‌ మడత పెట్టడంపై అవగాహన కలిగి ఉండాలి.
✓ పోలింగ్‌ కేంద్రంలోకి ఒకేసారి నలుగురు ఓటర్లను మాత్రమే అనుమతి.
✓ ఓటర్లు 12 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి చూపినా అనుమతించాలి.

Similar News

News December 7, 2025

MBNR: రెండో దశలో 239 మంది సర్పంచ్‌ల విత్‌డ్రా

image

స్థానిక సంస్థల రెండో దశ ఎన్నికల్లో మొత్తం 239 మంది సర్పంచ్‌ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 151 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్టు పేర్కొన్నారు. హన్వాడ మండలంలో అత్యధికంగా 58 మంది, కోయిలకొండలో 55 మంది నామినేషన్లను వెనక్కి తీసుకున్నట్టు ప్రకటనలో వెల్లడించారు.

News December 7, 2025

MBNR: సర్పంచ్‌ బరిలో 641 మంది అభ్యర్థులు

image

స్థానిక సంస్థల మూడో విడత ఎన్నికల్లో సర్పంచ్‌ స్థానాల కోసం 641 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. మొత్తం 133 గ్రామ పంచాయతీలకు గాను, జడ్చర్ల మండలంలో ఒకటి ఏకగ్రీవమవడంతో 132 జీపీలలో ఎన్నికలు జరగనున్నాయి. అత్యధికంగా బాలానగర్‌లో 37, జడ్చర్లలో 45 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు అధికారులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

News December 7, 2025

MBNR: మూడో విడతలో 2,786 మంది అభ్యర్థులు

image

స్థానిక సంస్థల మూడో విడత ఎన్నికలకు సంబంధించిన తుది వివరాలను అధికారులు వెల్లడించారు. మొత్తం 1,152 వార్డులకు గాను, ఏడు వార్డులు మినహా 1,145 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల బరిలో 2,786 మంది వార్డు సభ్యులు నిలిచినట్టుగా అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జడ్చర్లలో అత్యధికంగా 376, బాలానగర్‌లో 308 మంది పోటీలో ఉన్నట్టు పేర్కొన్నారు.