News October 1, 2024
MLC ఎన్నికలకు ఓట్లు నమోదు చేసుకోండి: జూలకంటి

కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచించారు. మాచర్లలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎన్నికలతో పాటు ఓటర్ లిస్టు ఉండదని అందరూ నూతనంగా తమ ఓటును నమోదు చేసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 6 వరకు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఈ అవకాశాన్ని గ్రాడ్యుయేట్స్ వినియోగించుకోవాలని ఆయన కోరారు.
Similar News
News November 19, 2025
గుంటూరు జిల్లా రైతుల ఖాతాల్లో ఎంత పడతాయంటే ?

అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ కింద రైతుల ఖాతాల్లో ప్రభుత్వం బుధవారం నిధులు జమ చేయనుంది. గుంటూరు జిల్లాలో 1,06,329 మంది రైతుల ఖాతాల్లో రూ.70 కోట్లు జమ కానున్నాయి. అన్నదాత సుఖీభవ కింద రూ.53.16 కోట్లు, అదేవిధంగా పీఎం కిసాన్ కింద రూ.16.84 కోట్లు జమ అవుతాయని అధికారులు తెలిపారు. జిల్లా స్థాయి కార్యక్రమం లామ్ ఫామ్ ఆడిటోరియంలో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట నుండి జరగనుంది. మంత్రి కందుల దుర్గేశ్ పాల్గొంటారు.
News November 19, 2025
గుంటూరు: యువతిని వేధించిన కేసులో నిందితుడికి జైలు శిక్ష

ప్రేమ పేరుతో యువతిని వెంబడించి వేధించిన కేసులో నిందితుడు పాత గుంటూరు సయ్యద్ జుబేర్ అహ్మద్కు మొదటి AJCJ కోర్టు 7 నెలల జైలు శిక్షతో పాటు రూ.3,000 జరిమానా విధించింది. 2019లో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి, పోలీసులు సాక్ష్యాలతో కోర్టుకు సమర్పించగా తీర్పు వెలువడింది. ఇలాంటి మహిళలపై దాడులు, వేధింపులను కఠినంగా ఎదుర్కొంటామని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
News November 19, 2025
వల్లభాపురం: ప్రమాదవశాత్తు యంత్రంలో పడి మహిళ మృతి

కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామపంచాయతీ పరిధిలోని మాదిగ లంకకు మినుములు నూర్చడానికి వచ్చిన మహిళ ప్రమాదవశాత్తు చనిపోయినట్లు కొల్లిపర ఎస్సై పి.కోటేశ్వరరావు తెలిపారు. వల్లూరుపాలెంకు చెందిన షేక్ కాసింబి(40) ప్రమాదవశాత్తు మినుము నూర్పిడి యంత్రంలో చీర ఇరుక్కుని చేతులు, మెడకు తీవ్ర గాయాలై చనిపోయినట్లు తెలిపారు. ఆమె భర్త ఇస్మాయిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.


