News February 26, 2025
MLC ఎన్నికలకు 174 మందితో బందోబస్త్: ఎస్పీ

రేపు జరుగనున్న MLC ఎన్నికలకు సంబంధించి జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో మొత్తం పోలింగ్ కేంద్రాల్లో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద 174 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నట్లు ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. 8 రూట్లలో ఆయుధ పహారాలో పోలింగ్ సామాగ్రిని తరలించడం జరుగుతుందన్నారు. స్ట్రైకింగ్ ఫోర్స్, QRTలు, డీఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News February 27, 2025
ఏడుపాయలలో తెలంగాణ జానపదుల సమ్మేళనం

ఏడుపాయల మహా జాతర అంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడుతుంది. నెత్తిన బోనం, శివసత్తుల పూనకాలతో అమ్మవారి ప్రాంగణం వన దుర్గ మాత నామస్మరణతో పోరెత్తుతోంది. హైదరాబాద్తో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులు అమ్మవారి మొక్కలు చెల్లించుకోవడానికి ముందుకు సాగుతున్నారు. బోనాలతో ప్రదర్శనగా వెళ్లి అమ్మవారికి మొక్కులు సమర్పిస్తున్నారు.
News February 27, 2025
మెదక్: MLC ఎన్నికలకు పటిష్ట బందోబస్తు

మెదక్ జిల్లాలో జరగబోయే ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ MLC ఎన్నికకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద 174 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 163 BNSS ఆక్ట్ (144 సెక్షన్) అమలులో ఉంటుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
News February 27, 2025
ఏడుపాయల దర్శనానికి పోటెత్తిన భక్తులు

మహాశివరాత్రి సందర్భంగా ఏడుపాయల వనదుర్గా మాత అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. మూడు రోజులపాటు జరిగే మహా జాతర ప్రారంభం కాగా రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఏడుపాయల చేరుకుంటున్నారు. అమ్మవారిని దర్శించుకుని ఉపవాస దీక్షలు విటమించారు. జై దుర్గా, వన దుర్గా అంటూ భక్తుల నినాదాలు మారు మ్రోగాయి. క్యూ లైన్లలో భక్తులు పెద్ద ఎత్తున వేచి ఉన్నారు.