News February 11, 2025
MLC ఎన్నికలకు 59 మంది నామినేషన్ల దాఖలు

ఉభయగోదావరి జిల్లాలో MLC ఎన్నికలు ఈనెల 27న జరగనున్నాయి. కాగా సోమవారం 59 మంది అభ్యర్థులు 72 సెట్ల నామినేషన్లు వేశారు. ఈనెల 11న ( నేడు)నామినేషన్ పత్రాల పరిశీలన చేయనున్నారు. 13న సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదే రోజు సాయంత్రం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు.
Similar News
News November 29, 2025
చారకొండ: ఎన్నికల బహిష్కరణకు ఎర్రవల్లి తీర్మానం

చారకొండ మండలంలోని ఎర్రవల్లి గ్రామ భూ నిర్వాసితుల కమిటీ సర్పంచ్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఏకగ్రీవంగా తీర్మానించింది. రిజర్వాయర్ సమస్యపై ప్రభుత్వం స్పందించకపోవడం, గ్రామ అభిప్రాయం లేకుండా పునరావాస ప్యాకేజీలను ప్రకటించడం పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించి, గ్రామాన్ని ముంపు నుంచి కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
News November 29, 2025
ChatGPTలో ఇది ఎప్పుడైనా గమనించారా?

అడ్వాన్స్డ్ AI టూల్ అయిన ChatGPT టైమ్ చెప్పలేకపోవడం చర్చగా మారింది. దీనికి ప్రధాన కారణంగా ChatGPTకి సిస్టమ్ టైమ్కు నేరుగా యాక్సెస్ ఉండకపోవడం. రియల్టైమ్ డేటా చేర్చడానికి కొన్ని టెక్నికల్ సమస్యలు ఉండటంతో పాటు AI గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే Gemini, Copilot, Grok వంటి AI టూల్స్ మాత్రం ఆటోమేటిక్గా టైమ్ చెప్తున్నాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు OpenAI పనిచేస్తోంది.
News November 29, 2025
నిజామాబాద్: పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ పరీక్షల నేపథ్యంలో నిజామాబాద్ సబ్ డివిజన్ పరీక్షా కేంద్రాల వద్ద డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు ఉదయం 8గం.ల నుంచి మధ్యాహ్నం 1 గం. వరకు బీఎన్ఎస్ సెక్షన్ 163 అమలు చేయనున్నట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడరాదని, నిషేధిత వస్తువులతో పరీక్షా కేంద్రాల వద్ద తిరగవద్దని సీపీ సూచించారు.


