News February 5, 2025
MLC ఎన్నికలు.. గుంటూరులో మహేశ్ బాబుకు ఓటు

గుంటూరు, కృష్ణాజిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా గుంటూరు పట్టణ పరిధిలో ప్రముఖ సినీ హీరో మహేశ్ బాబు పేరుతో ఓటర్ జాబితాలో ఓటు నమోదు కావడంతో ఒక్కసారిగా కలకలం రేపుతోంది. డోర్ నంబర్ 31-22-1639, విద్యార్హత బీకాం, పుట్టిన తేదీ 1975 ఆగస్టు 9వ తేదీన వివరాలతో బూత్ నంబర్ 2014, వరుస సంఖ్య 1179తో మహేశ్ బాబు ఫొటో అప్లోడ్ చేసినట్లు జాబితాలో ఉంది. కాగా ఈ విషయంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 8, 2026
T20 వరల్డ్ కప్: గుల్బదిన్ మెరుపులు.. న్యూజిలాండ్ లక్ష్యం 183

చెన్నైలో జరుగుతున్న T20 WC గ్రూప్-D మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ అదరగొట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినప్పటికీ గుల్బదిన్ నైబ్ (63) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నారు. అటల్ (29), గుర్బాజ్ (27) రాణించారు. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్ రెండు వికెట్లు తీయగా రవీంద్ర, డఫీ, హెన్రీ తలో వికెట్ పడగొట్టారు.
News February 8, 2026
HYD: తెలంగాణ మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లు

మీ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువు చెప్పిస్తారా? తెలంగాణ మోడల్ స్కూళ్లలో 6th క్లాస్‌తో పాటు 7-10 క్లాసుల్లో ఖాళీల భర్తీకి అడ్మిషన్ల నోటిఫికేషన్ వచ్చేసింది. ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష ఉంటుంది. స్మార్ట్ క్లాసులు, ల్యాబ్స్, భోజనం, యూనిఫామ్స్ ఫ్రీ. శంకర్‌పల్లి, షాబాద్, ఎంకేపల్లి తదితర చోట్ల శాఖలు ఉన్నాయి. FEB 28లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు tgms.telangana.gov.inను సందర్శించండి.
News February 8, 2026
రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఆరోపణలు: చిన్న శ్రీను

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై CM చంద్రబాబు చేసిన ఆరోపణలు రాజకీయ లబ్ధి కోసమేనని, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఆయన వ్యవహరించారని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మండిపడ్డారు. ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. దేశంలోనే అత్యున్నత ల్యాబ్‌లు అయిన NDRI, NDDB తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని స్పష్టం చేసిందన్నారు. మాట మార్చడంలో CM సిద్ధహస్తుడన్నారు.


