News February 5, 2025

MLC ఎన్నికలు..జిల్లాలో మహేశ్ బాబుకు ఓటు

image

ఉమ్మడి గుంటూరు, కృష్ణాజిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా గుంటూరు పట్టణ పరిధిలో హీరో మహేశ్ బాబు పేరుతో ఓటర్ జాబితాలో ఓటు నమోదు కావడంతో ఒక్కసారిగా కలకలం రేపుతోంది. డోర్ నంబర్ 31-22-1639, విద్యార్హత బీకాం, పుట్టిన తేదీ 1975 ఆగస్టు 9వ తేదీన వివరాలతో బూత్ నంబర్ 2014, వరుస సంఖ్య 1179తో మహేశ్ ఫొటో అప్లోడ్ చేసినట్లు జాబితాలో ఉంది. కాగా ఈ విషయంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News February 10, 2025

రంగరాజన్‌పై దాడి దురదృష్టకరం: పవన్

image

చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకులు రంగరాజన్‌పై జరిగిన దాడిని AP Dy.CM పవన్ ఖండించారు. ఇది దురదృష్టకరమని, ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలని చెప్పారు. దాడి వెనుక కారణాలేంటో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ దాడిని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం తనకు రంగరాజన్ అనేక సూచనలు చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఆయన్ను పరామర్శించాలని TG జనసేన నేతలకు పవన్ సూచించారు.

News February 10, 2025

ఇచ్చోడ: 53 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు

image

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 53 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులు కలుసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ప్రభుత్వ పాఠశాలలో 1972-73 10వ తరగతి బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం 23 మంది విద్యార్థుల్లో 7గురు మరణించగా మిగిలిన 17 మంది పూర్వ విద్యార్థులు కలుసుకోవడం విశేషం. పాఠాలు చెప్పిన గురువులలో ఉన్న ఏకైక ఉపాధ్యాయుడు పోశెట్టిని సన్మానించారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

News February 10, 2025

మండపేట: సెంట్రింగ్ కర్ర తగిలి వ్యక్తి మృతి

image

మండపేటకు చెందిన కొమ్మిశెట్టి సత్తిబాబు సోమవారం అనపర్తికి తన ఆటోలో సెంట్రింగ్ కర్రలు పట్టుకుని పనికి వెళ్లాడు. ఆటో టైర్ సెంట్రింగ్ కర్రపైకి ఎక్కింది. అదే వేగంతో కర్ర ఒక పక్క లేచి సత్తిబాబు ముఖానికి గట్టిగా తగిలింది. దీంతో ఒక్కసారిగా అతను వెనక్కి పడిపోయాడు. స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు తెలిపారు.

error: Content is protected !!