News March 4, 2025

MLC ఎన్నికల్లో తొలిసారి గెలవబోతున్న టీడీపీ..!

image

గోదావరి గడ్డపై పట్టభద్రుల MLC స్థానంలో టీడీపీ నుంచి తొలివిజయం నమోదు కానుంది. 2007లో శాసనమండలి ఏర్పడ్డాక 2007, 2013, 2019 గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. గోదావరి జిల్లాలో గత 3సార్లు పీడీఎఫ్ లేదా ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. అలాంటి గోదావరి గడ్డపై రాజశేఖరం గెలుపు దాదాపు ఖరారైంది. 80వేల ఓట్లు మెజార్టీ సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం 41,153 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Similar News

News March 4, 2025

తూ.గో: ఇంటర్ పరీక్షకు 23,655 మంది విద్యార్థుల హాజరు

image

తూ.గో జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఇంగ్లీష్-1 పరీక్షకు 23,655 మంది విద్యార్థులు హాజరైనట్లు ఆర్‌ఐఓ ఎల్ నరసింహం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 51 కేంద్రాలలో ఈ పరీక్షను నిర్వహించగా జనరల్, ఒకేషనల్ విభాగాల్లో 795 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. ఆర్‌ఐఓ, డీవీఈఓ, ఫ్లయింగ్, సెన్సింగ్ స్క్వాడ్లు, కస్టోడియన్లు ఈ పరీక్షలను పర్యవేక్షించారన్నారు.

News March 4, 2025

జర్మనీలో తూ.గో. మంత్రికి ఘన స్వాగతం

image

జర్మనీ డి బెర్లిన్ ఎక్స్‌పో సెంటర్ సిటీలో ప్రారంభమయ్యే ఐటీబీ బెర్లిన్-2025 సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన రాష్ట్ర పర్యాటక, సంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌కు జర్మనీలో జనసేన నేతలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో పర్యటక రంగంలో పెట్టుబడులు కోసం ఈ సదస్సులో చర్చించడం జరుగుతుంది. మంత్రితో పాటు ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి పాల్గొంటారు.

News March 4, 2025

రాజమండ్రి: కొనసాగుతున్న కౌంటింగ్.. దూసుకుపోతున్న పేరాబత్తుల

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి 48,923 ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులకు 16,806 ఓట్లు పోలయ్యాయి. 28 టేబుళ్లలో 3వ రౌండ్ ఓట్లు లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి 76,345 ఓట్లు చెల్లినవి కాగా, 7,655 చెల్లని ఓట్లుగా నిర్ధారించారు. రాజశేఖరం, వీర రాఘవులు మధ్య 32,117 ఓట్ల వ్యత్యాసం ఉంది.

error: Content is protected !!