News February 26, 2025

MLC ఎన్నికల సామాగ్రి పరిశీలించిన కలెక్టర్

image

నరసరావుపేట పట్టణంలోని SSN డిగ్రీ కళాశాలలో ఉమ్మడి కృష్ణా- గుంటూరు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల సామాగ్రి వితరణ కేంద్రంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పరిశీలించారు. అనంతరం అధికారులకు మంగళవారం పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మురళి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 1, 2025

రంప ఏజెన్సీలో హై అలర్ట్!

image

డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు మావోయిస్టులు PLGA వారోత్సవాలకు పిలుపునిచ్చారు. ఈ వారోత్సవాలలో ఎన్‌కౌంటర్లలో మృతిచెందిన మావోయిస్టులకు ఆ పార్టీ శ్రేణులు నివాళులు అర్పిస్తారు. ఏటా ఈవారోత్సవాలు జరగడం, పోలీసులు అప్రమత్తంగా ఉండడం సాధారణమే అయినప్పటికీ, ఇటీవల జరిగిన మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌ల నేపథ్యంలో ఈసారి రంప ఏజెన్సీలో మరింత హైఅలర్ట్ ప్రకటించారు. పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

News December 1, 2025

జగిత్యాల: ‘ఈ సంవత్సరం 83 కేసులు నమోదు’

image

ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా జగిత్యాల కలెక్టరేట్ నుంచి మెడికల్ కాలేజీ వరకు నిర్వహించిన ర్యాలీని అదనపు కలెక్టర్ బి.రాజగౌడ్ ప్రారంభించారు. ఎయిడ్స్‌కు నివారణే మేలని, యువత జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లాలో 2,573 మంది ఏఆర్‌టి చికిత్స పొందుతున్నారని వైద్య అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం 83 కేసులు నమోదయ్యాయని చెప్పారు. పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు.

News December 1, 2025

మెదక్: శిక్షణలో ప్రతిభ చూపిన కానిస్టేబుల్

image

మెదక్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ప్రశాంత్ శిక్షణలో ప్రతిభ చూపడంతో ఎస్పీ డివి శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ మహేందర్ అభినందించారు. మొయినాబాద్ ఐఐటీఏ శిక్షణకు వివిధ జిల్లా నుంచి 51 మంది హాజరయ్యారు. జిల్లాకు చెందిన ప్రదీప్, ప్రశాంత్, రాకేష్ హాజరయ్యారు. ఫైరింగ్, పీపీటీ విభాగాల శిక్షణలో ప్రశాంత్ ఉత్తమ ప్రతిభ చూపి మెడల్ పొందాడు. ప్రశాంత్‌ను ఎస్పీ అభినందించారు.