News March 3, 2025

MLC కౌంటింగ్.. ఎలిమినేట్ అవుతున్న అభ్యర్థులు

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తక్కువ ఓట్లు పోలైన అభ్యర్థులు ఎలిమినేట్ అవుతున్నారు. 6వ రౌండ్ పూర్తయ్యేసరికి ఐదుగురు అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. ఇంకా ఐదుగురు అభ్యర్థులు మిగిలి ఉన్నారు. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన అభ్యర్థులలో పి.శివ ప్రసాద్, ఎస్‌ఎస్.పద్మావతి, డాక్టర్ కే.రాధాకృష్ణ, ఆర్.సత్యనారాయణ, డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు ఉన్నారు. కాగా ‘గాదె’ ముందంజలో కొనసాగుతున్నారు.

Similar News

News November 24, 2025

వికారాబాద్: బంగారు కడ్డీ ఆశ చూపి.. మహిళకు టోకరా

image

ఒంటిపై ధరించిన నగలు ఇస్తే 12 తులాల బంగారు కడ్డీ ఇస్తామని గుర్తుతెలియని దుండగులు ఓ మహిళను బురిడీ కొట్టించారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ధారూర్ మండల రుద్రారం గ్రామానికి చెందిన కంది లక్ష్మి సంతకు వచ్చింది. కొంత మంది ఆమెకు నమ్మించి ఆమె దగ్గర ఉన్న తులంన్నర బంగారాన్ని దుండగులు తీసుకెళ్లారు. ఈ మేరకు ఆమె ధారూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News November 24, 2025

రేపు పున: ప్రారంభం కానున్న వరంగల్ మార్కెట్

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున: ప్రారంభం కానుంది. శని, ఆదివారాల్లో వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో సోమవారం ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెట్‌కు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా, ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.