News August 29, 2024
MLC సునీత రాజీనామా.. ఆ స్థానంలో బీటెక్ రవి?

వైసీపీ MLC పోతుల సునీత బుధవారం పార్టీ సభ్యత్వంతో పాటు MLC పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఆమె టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, ఆమె రాజీనామాతో ఖాళీ అయిన MLC స్థానాన్ని పులివెందులకు చెందిన TDP సీనియర్ నేత బీటెక్ రవికి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పులివెందుల పోటీ చేసిన బీటెక్ రవి జగన్పై ఓడిపోయిన విషయం తెలిసిందే.
Similar News
News September 19, 2025
వరి పంట నారుమడులను పరిశీలించిన కలెక్టర్

దువ్వూరు మండలంలో సాగు చేసిన వరి పంట నారుమడులను గురువారం కలెక్టర్ శ్రీధర్ పొలాలకు వెళ్లి నేరుగా పరిశీలించి రైతులతో మాట్లాడారు. పంటల సాగు పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విత్తనాలు, ఎరువులు అందుబాటుపై రైతులతో చర్చించారు. తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించేందుకు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలన్నారు. డిమాండ్, మార్కెట్ ఉన్న వాటిని సాగు చేయాలని సూచించారు.
News September 19, 2025
చింతకుంటలో ఎరువుల పంపిణీని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్

దువ్వూరు మండలం చింతకుంటలోని రైతు సేవా కేంద్రంలో గురువారం జరిగిన యూరియా పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జిల్లా వ్యవసాయ అధికారి చంద్ర నాయక్ పరిశీలించారు. రైతులు యూరియా వినియోగాన్ని క్రమేనా తగ్గించాలని, దీని స్థానంలో నానో యూనియన్ వాడాలని సూచించారు. ఎరువుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News September 18, 2025
కడప: జాతీయ ప్రతిభా ఉపకార వేతన దరఖాస్తుకు అవకాశం

కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రతిభ ఉపకార వేతన పథకo ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని, దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30న చివరి గడువని డీఈవో శంషుద్దీన్ గురువారం తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులు అర్హులన్నారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగ విద్యార్థులలు పరీక్ష ఫీజు రూ. 50 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.