News February 23, 2025
MLC స్థానాన్ని కాంగ్రెస్ గెలిచి CMకు గిఫ్ట్ ఇవ్వాలి: మంత్రి

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలిచి సీఎం రేవంత్ రెడ్డికి గిఫ్ట్గా ఇవ్వాలని మంత్రి దామోదర్ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలతో మంత్రులు దామోదర్ రాజనర్సింహ, కొండా సురేఖ ఎన్నికల సన్నాహ సమావేశం నిర్వహించారు. మంత్రులు మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ తర్వాతా మిగిలిన ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామన్నారు.
Similar News
News December 6, 2025
మెదక్: నేడు రెండో విడత అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు

మెదక్ జిల్లాలో రెండో విడత ఎన్నికలు జరగనున్న గ్రామ పంచాయతీలలో పోటీ చేసే అభ్యర్థులకు నేడు గుర్తులు కేటాయించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండగా, అనంతరం తెలుగు అక్షరమాల పద్ధతిలో అభ్యర్థులకు గుర్తులను కేటాయించనున్నారు. మెదక్, చిన్న శంకరంపేట, రామాయంపేట, నిజాంపేట తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగి మండలాలలో రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి.
News December 6, 2025
ఉమ్మడి మెదక్ జిల్లాలో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు

ఉమ్మడి మెదక్ జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాలో కోహీర్ 10.0, మెదక్ జిల్లాలో పెద్ద నర్లాపూర్11.2, సిద్దిపేట జిల్లాలో అంగడి కిష్టాపూర్ 10.6 °C అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలితీవ్రత దృష్ట్యా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
News December 6, 2025
మెదక్: అప్పు ఎంతైనా పర్వాలేదు.. గెలవాలంతే!

మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈనెల 11, 14, 17వ తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ తేదీలు దగ్గర పడుతున్న కొద్ది జిల్లాల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. పలు పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా కాసుల వేట కొనసాగిస్తున్నారు. ఎక్కువ అభ్యర్థులు పోటీ చేసే జనరల్ స్థానాల్లో ఈ ధోరణి తారస్థాయిలో ఉంది. కొంతమంది అభ్యర్థులు అయితే తమ వద్ద డబ్బులు లేక అప్పులు చేసి మరి ఖర్చు పెడుతున్నారు.


