News March 10, 2025
MLC అభ్యర్థి కావలి గ్రీష్మ రాజకీయ ప్రస్థానమిదే

సంతకవిటి(M) కావలికి చెందిన కావలి గ్రీష్మ 2015లో TDP ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2016-22 మధ్యలో రాజాం పట్టణ టీడీపీ అధ్యక్షురాలిగా, ఏరియా ఆసుపత్రి ఛైర్ పర్సన్‌గా, సీబీఎన్ ARMY రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశారు. గ్రీష్మ శాసనసభ మాజీ స్పీకర్ సీనియర్ నాయకురాలు కావలి ప్రతిభా భారతి కుమార్తె. SC సామాజికవర్గానికి చెందిన గ్రీష్మ ఉన్నత విద్యావంతురాలు.
Similar News
News January 29, 2026
VZM: హత్య కేసులో నిందితుడు అరెస్ట్

ఈ నెల 25న పాతరేగలో యాసర్ల సింహాచలం (70)ను చేతులతో కొట్టి హత్య చేసిన ఘటనలో నిందితుడు పెద్దింటి తిరుపతిని బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు వెల్లడించారు. మృతుడు సింహాచలం వద్ద నిందితుడు రూ.400లు అప్పుగా తీసుకున్నాడు. వాటిని ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ దాడికి దారితీసింది. ఈ ఘటనలో సింహాచలాన్ని తిరుపతి తోసివేయడంతో కుళాయి దిమ్మెపై పడి మృతి చెందాడు.
News January 29, 2026
మంజూరైన ఇళ్లన్నీ ఉగాదికి సిద్ధం చేయాలి: VZM కలెక్టర్

ఉగాది నాటికి మంజూరైన గృహాలన్నింటినీ పూర్తిచేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. మండల స్థాయి అధికారులు, నియోజకవర్గాల ప్రత్యేకాధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిపై మండలాల వారీగా వారం వారీ లక్ష్యాలను నిర్దేశించామని, ఇకపై ప్రతి వారం పురోగతిపై సమీక్ష జరుగుతుందని తెలిపారు. గృహ నిర్మాణాల్లో స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు.