News February 5, 2025
MLC ఎన్నికలు..జిల్లాలో మహేశ్ బాబుకు ఓటు

ఉమ్మడి గుంటూరు, కృష్ణాజిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా గుంటూరు పట్టణ పరిధిలో హీరో మహేశ్ బాబు పేరుతో ఓటర్ జాబితాలో ఓటు నమోదు కావడంతో ఒక్కసారిగా కలకలం రేపుతోంది. డోర్ నంబర్ 31-22-1639, విద్యార్హత బీకాం, పుట్టిన తేదీ 1975 ఆగస్టు 9వ తేదీన వివరాలతో బూత్ నంబర్ 2014, వరుస సంఖ్య 1179తో మహేశ్ ఫొటో అప్లోడ్ చేసినట్లు జాబితాలో ఉంది. కాగా ఈ విషయంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 13, 2025
MHBD: బీసీ విద్యార్థులకు ఉపకార వేతన దరఖాస్తులు ఆహ్వానం

2025-26 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని 9, 10వ తరగతులు చదువుతున్న బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి బి.శ్రీనివాసరావు గురువారం తెలిపారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులు ఈ-పాస్ వెబ్‌సైట్ https://telanganaepass.cgg.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News November 13, 2025
విద్యార్థులను చూసి చలించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం వద్ద ఆటోలో ప్రమాదకర స్థితిలో వెళ్తున్న మోడల్ స్కూల్ విద్యార్థులను చూసి చలించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆటోను ఆపి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల సమయానికి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేయాలని మిర్యాలగూడ ఆర్టీసీ డిపో అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎమ్మెల్యే స్పందన పట్ల స్థానిక ప్రజలు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
News November 13, 2025
విశాఖ: ఏపీ ప్రభుత్వంతో రెన్యూ పవర్ ఒప్పందం

విశాఖలో ఏపీ ప్రభుత్వంతో రెన్యూ పవర్ సంస్థ ఒప్పందం చేసుకుంది. రూ.82వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమక్షంలో రెన్యూ పవర్ సంస్థ ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకుంది. పునరుత్పాదక శక్తి, సోలార్ తయారీ, బ్యాటరీ స్టోరేజ్, పంప్డ్ హైడ్రో, గ్రీన్ అమ్మోనియా రంగాల్లో రెన్యూ పవర్ సంస్థ పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొన్నారు. ఎంఓయూల ద్వారా 10 వేలకు పైగా ఉద్యోగాలకు అవకాశం లభించనుంది.


