News February 22, 2025
MLC ఎన్నికల్లో విజయం బీజేపీదే: బండి సంజయ్

రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డిలో పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం శనివారం నిర్వహించారు. కమిట్‌మెంట్‌తో పని చేస్తే పార్టీ క్యాడర్ బీజేపీకే సొంతం అవుతుందని ఈ సందర్భంగా కార్యకర్తలకు సూచించారు. ముఖ్యంగా 317 జీవోకు వ్యతిరేకంగా టీచర్ల సమస్యలపై మొదటి నుంచి పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని తెలిపారు.
Similar News
News February 23, 2025
సంగారెడ్డి: విద్యార్థులతో వంటలు చేయించిన ఉపాధ్యాయుల సస్పెన్షన్

కంగ్టి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ వసతి గృహంలో విద్యార్థులతో వంటలు చేయించిన ఉపాధ్యాయులను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సస్పెన్షన్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కంగ్టి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో విద్యార్థులతో వంటలు చేసిన వార్తలు వెలువడడంతో నారాయణఖేడ్ ఆర్డీఓ అశోక్ చక్రవర్తిని విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం ఫిజికల్ డైరెక్టర్ మహేశ్, మ్యాథ్స్ టీచర్ శివకుమార్‌లను సస్పెన్షన్ చేశారు.
News February 23, 2025
మెదక్: ఏడుపాయల జాతర నిధులకు ఎన్నికల కోడ్!

మెదక్ జిల్లాలో పవిత్రమైన ఏడుపాయల జాతర నిధులకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారనుంది. ఈనెల 26వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జాతర జరగనుంది. జాతరకు సుమారుగా 15 లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రతి సంవత్సరం ప్రభుత్వం రెండు కోట్లను మంజూరు చేస్తుంది. మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది.
News February 23, 2025
శ్రీశైల మల్లన్నకు అమరచింత పట్టు వస్త్రాలు

శ్రీశైల మల్లన్న స్వామి బ్రహ్మోత్సవాలకు అమరచింత పద్మశాలీలు శ్రీశైల మల్లన్న సన్నిధిలో పట్టు వస్త్రాలను తయారు చేస్తున్నారు. పద్మశాలి వంశస్థులు భాగస్వాములై ఏటా పట్టు వస్త్రాలను నేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. మల్లన్న సన్నిధిలో ప్రియమైన నిష్ఠలతో పట్టు వస్త్రాలను తయారు చేసి బ్రహ్మోత్సవాల రోజు స్వామివారికి సమర్పించనున్నట్లు అధ్యక్షులు మహంకాళి విష్ణు తెలిపారు.