News June 8, 2024

MLC ఓట్ల లెక్కింపు: మూడురోజుల పాటు నానా అవస్థలు

image

పట్టభద్రుల MLC ఉపఎన్నిక లెక్కింపు 60 గంటలకు పైగా సాగింది. కౌంటింగ్‌లో మొత్తం 52మంది అభ్యర్థులు, 3వేల మందికి పైగా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 12 గంటల పాటూ ఏకధాటిగా విధుల్లో ఉండడంతో అలసిపోయారు. గోదాముల్లో కూలర్లు ఏర్పాటు చేసినా అక్కడి ఉక్కపోతతో కొంతమంది డీ హైడ్రేషన్‌కు గురయ్యారు. గతంలో 56 టేబుళ్లపై లెక్కించగా.. ఈదఫా 96టేబుళ్లపై ఓట్లను లెక్కించినా ప్రక్రియ ఆలస్యమవడంతో అవస్థలు పడినట్లు తెలిపారు.

Similar News

News November 30, 2024

వరంగల్: ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందించే అవకాశం పోలీసులకు మాత్రమే: సీపీ

image

తొమ్మిది నెలలు శిక్షణను పూర్తిచేసుకుని విధులు నిర్వహించేందుకు సిద్ధమైన 578 మంది కానిస్టేబుళ్లతో సీపీ అంబర్ కిషోర్ ఝా శనివారం సమావేశం నిర్వహించారు. ప్రజలకు ప్రత్యక్షంగా సేవలు అందించే అవకాశం పోలీసులకు మాత్రమే ఉంటుందన్నారు. ప్రజల మన్ననలు పొందేవిధంగా విధులు నిర్వర్తించాలన్నారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు.

News November 30, 2024

టీజీపీఎస్సీ నూతన ఛైర్మన్‌గా జనగామ వాసి 

image

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా జనగామ మండలం ఓబుల్ కేశ్వపూర్ గ్రామానికి చెందిన బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. డిసెంబర్ 3న ప్రస్తుత ఛైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. ఈ మేరకు వెంకటేశంను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు.

News November 30, 2024

వరంగల్: అన్నారం షరీఫ్‌లో వ్యక్తి మృతి

image

వరంగల్ జిల్లాలో విషాదం జరిగింది. పోలీసుల వివరాలు.. పర్వతగిరి మం. అన్నారం షరీఫ్‌లోని ఓ హోటల్‌‌లో గోరుకాటి చేరాలు(50) పని చేస్తున్నాడు. పెద్దతండాకు చెందిన ఓ వ్యక్తి తాగిన మైకంలో చేరాలును శనివారం తెల్లవారుజామున ఆటోలో తీసుకెళ్లాడు. విపరీతంగా కొట్టి అన్నారం కెనరా బ్యాంక్ ఎదురుగా పడేశాడు. ఉదయాన్నే అటుగా వెళ్లే అయ్యప్ప భక్తులు గాయాలతో ఉన్న చేరాలును గమనించి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు.