News June 5, 2024
MLC ఉప ఎన్నిక కౌంటింగ్.. వారిద్దరి మధ్యే పోటీ!

TG: నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ MLC ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఇప్పటివరకు 4 రౌండ్లు పూర్తికాగా, మొత్తం 96వేల ఓట్లను లెక్కించారు. తీన్మార్ మల్లన్న(కాంగ్రెస్), రాకేశ్ రెడ్డి(బీఆర్ఎస్) మధ్య పోటీ నెలకొంది. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి మూడో స్థానంలో కొనసాగుతున్నారు. చెల్లని ఓట్లు భారీగా నమోదవుతున్నట్లు సమాచారం. 4 హాళ్లు, 96 టేబుళ్లపై కౌంటింగ్ కొనసాగుతోంది.
Similar News
News December 14, 2025
రేపు ఢిల్లీకి మంత్రి నారా లోకేశ్

AP: రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖల మంత్రి నారా లోకేశ్ సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్లతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించనున్నారు.
News December 14, 2025
వార్డ్రోబ్ ఇలా సర్దేయండి

చాలామంది వార్డ్రోబ్ చూస్తే ఖాళీ లేకుండా ఉంటుంది. కానీ వేసుకోవడానికి బట్టలే లేవంటుంటారు. దీనికి కారణం సరిగ్గా సర్దకపోవడమే అంటున్నారు నిపుణులు. అన్ని దుస్తుల్ని విడివిడిగా సర్దుకోవాలి. రోజూ వాడేవి ఓచోట, ఫంక్షనల్ వేర్ మరో చోట పెట్టాలి. ఫ్యామిలీలో ఎవరి అల్మారా వారికి కేటాయించి సర్దుకోవడంలో భాగం చెయ్యాలి. సరిపడినన్ని అల్మారాలు లేకపోతే వార్డ్రోబ్ బాస్కెట్లు వాడితే వార్డ్రోబ్ నీట్గా కనిపిస్తుంది.
News December 14, 2025
ఈమె ఎంతో మందికి స్ఫూర్తి

TG: ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో ఓ యువతి ఓటర్లలో చైతన్యం నింపారు. అన్ని అవయవాలు సక్రమంగానే ఉన్నా ఎంతోమంది ఓటేయడానికి ఆసక్తి చూపరు. కానీ, రామాయంపేట పరిధి కల్వకుంటలో అంగవైకల్యమున్నా ఆమె పోలింగ్ బూత్కు వచ్చి ఓటేశారు. తండ్రి ఆమెను భుజాలపై మోసుకుని తీసుకెళ్లి ఓటు వేయించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు.


