News June 5, 2024
ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్
TG: ఇవాళ WGL-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల MLC ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. మే 27న జరిగిన పోలింగ్‌లో 72.44 శాతం ఓటింగ్ నమోదైంది. నల్గొండ(D) సమీపంలోని దుప్పలపల్లిలో ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. రేపటి వరకు కొనసాగే అవకాశం ఉంది. 3,36,013 బ్యాలెట్ ఓట్ల లెక్కింపును మొత్తం 96 టేబుళ్లపై చేపట్టనున్నారు. తీన్మార్ మల్లన్న(CONG), రాకేశ్ (BRS), అశోక్(స్వతంత్ర) ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారు.
Similar News
News November 28, 2024
HYDలో తగ్గిన యాపిల్ ధరలు
గత ఏడాదితో పోలిస్తే హైదరాబాద్‌లో యాపిల్ ధరలు తగ్గాయి. 2023 డిసెంబర్‌లో మంచి నాణ్యత గల యాపిల్స్ ఒక్కోటి ₹35-₹40, సాధారణ రకం పండ్లు ఒక్కోటి ₹25కు లభించాయి. ఈ ఏడాది నవంబర్ నాటికి హై క్వాలిటీ యాపిల్స్ ఒక్కోటి ₹18, రెగ్యులర్ క్వాలిటీ పండ్లు ఒక్కోటి ₹10కే దొరుకుతున్నాయి. కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లో పంటలు బాగా పెరగడం, HYD పండ్ల మార్కెట్‌లకు సరఫరా పెరగడంతో ధరలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
News November 28, 2024
వీలైనంత త్వరగా పింఛన్ల పెంపు: మంత్రి
TG: దివ్యాంగుల పింఛన్ రూ.6వేలకు వీలైనంత త్వరగా పెంచుతామని మంత్రి సీతక్క అన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో దివ్యాంగుల రాష్ట్ర స్థాయి క్రీడలను మంత్రి ప్రారంభించారు. బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడానికి సీఎం రేవంత్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
News November 28, 2024
ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ఫీచర్!
యూజర్ల సౌలభ్యం కోసం ఇన్‌స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ తరహాలో IGలోనూ లొకేషన్‌ను షేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం యూజర్లు చాట్‌లోకి వెళ్లిన తర్వాత మెనూబార్‌లో లొకేషన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. కరెంట్ లొకేషన్‌తో పాటు గంటపాటు లైవ్ లొకేషన్‌నూ షేర్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆప్షన్ ప్రస్తుతం కొన్ని దేశాలకే పరిమితం చేసినట్లు మెటా సంస్థ పేర్కొంది. త్వరలో మిగిలిన దేశాలకూ విస్తరించనుంది.