News May 3, 2024

ఎమ్మెల్సీ ఉపఎన్నిక.. BRS అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డి

image

TG: నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు BRS తన అభ్యర్థిని ప్రకటించింది. ఈ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ఏనుగులు రాకేశ్ రెడ్డి పోటీ చేస్తారని కేసీఆర్ అనౌన్స్ చేశారు. గతంలో ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేసి, ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో అక్కడ ఉపఎన్నిక వచ్చింది.

Similar News

News December 4, 2025

పూజల్లో అరటి పండు ప్రాధాన్యత

image

పూజలు, వ్రతాలు, శుభకార్యాల్లో అరటికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే, ఇతర పండ్లలాగా దీనికి ఎంగిలి ఉండదు. అదెలా అంటారా? దాదాపు అన్ని చెట్లు వాటి గింజల నుంచి మొలుస్తాయి. ఆ గింజలను మనం ఎంగిలిగా భావిస్తాం. కానీ, అరటి అలా కాదు. ఇది మొక్కల ద్వారానే వృద్ధి చెందుతుంది. అందుకే దీన్ని పూర్ణఫలంగా, పవిత్రమైనదిగా దేవుడికి నివేదిస్తారు. పండ్లను, ఆకులను.. ఇలా ఈ చెట్టులోని ప్రతి భాగాన్ని పూజకు వాడుతారు.

News December 4, 2025

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో తాత్కాలిక ప్రాతిపదికన 1,146 అకడమిక్ ఇన్‌స్ట్రక్చర్లను భర్తీ చేయనున్నారు. వీటిలో 892 సబ్జెక్ట్ టీచర్లు, 254 SGT పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు రేపటి వరకు అప్లై చేసుకోవచ్చు. 7వ తేదీ లోపు ఎంపిక చేపడుతారు. అభ్యర్థులు డిసెంబర్ 8 నుంచి విధుల్లో చేరాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ టీచర్‌కు నెలకు రూ.12,500, SGTలకు రూ.10వేలు చెల్లిస్తారు.

News December 4, 2025

అంతరిక్షం నుంచి పవిత్ర మక్కా ఎలా ఉందో చూడండి!

image

ముస్లింల పవిత్ర నగరం ‘మక్కా’ అద్భుత చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భూమికి 400KM దూరంలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS) నుంచి రాత్రిపూట వ్యోమగామి డాన్ పెటిట్ ఫొటో తీశారు. ‘సౌదీ అరేబియాలోని మక్కా ఆర్బిటల్ వ్యూ ఇది. మధ్యలో వెలిగిపోతున్నది ఇస్లాం పవిత్ర స్థలం కాబా. స్పేస్ నుంచి కూడా కనిపిస్తోంది’ అని ట్వీట్ చేశారు. డాన్ పెటిట్ తన నాలుగో మిషన్‌లో ISS కుపోలా విండో నుంచి ఈ దృశ్యాన్ని తీశారు.