News June 26, 2024
APలో MLC ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

APలో MLAల ద్వారా జరిగే MLC ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు జులై 2వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. జులై 3న నామినేషన్లు పరిశీలిస్తారు. జులై 5 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. కూటమికే 2 స్థానాలు దక్కే ఛాన్సుంది. YCP పోటీ చేస్తే జులై 12న ఉ.9 నుంచి సా.4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. C.రామచంద్రయ్య, ఇక్బాల్‌పై అనర్హత వేటు పడటంతో 2 MLCలు ఖాళీ అయ్యాయి.
Similar News
News December 4, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* TGలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం(D) నాయకన్‌గూడెం చెక్‌పోస్ట్ వద్ద AP CM చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కారు తనిఖీ చేసిన పోలీసులు
* ఈ నెల 11న కడప మేయర్, కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు SEC నోటిఫికేషన్ జారీ.. అవినీతి ఆరోపణలతో ఇటీవల కడప మేయర్(YCP)ను తొలగించిన ప్రభుత్వం
* మూడో వన్డే కోసం విశాఖ చేరుకున్న IND, RSA జట్లు.. ఎల్లుండి మ్యాచ్
News December 4, 2025
రూ.5 లక్షలకు అఖండ-2 టికెట్

AP: అఖండ-2 మూవీ టికెట్‌ను చిత్తూరు MLA గురజాల జగన్మోహన్ రూ.5 లక్షలకు కొన్నారు. తనకు బాలకృష్ణపై ఉన్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నారు. బాలకృష్ణ అభిమానుల సంఘం నాయకులు MLAను కలిసి సినిమా టికెట్‌ను అందజేశారు. ఓ అభిమానిగా సినిమా విజయవంతం కావాలని ఆయన కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే సాంకేతిక సమస్యల కారణంగా అఖండ-2 మూవీ ప్రీమియర్స్‌ను నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ రద్దు చేసిన విషయం తెలిసిందే.
News December 4, 2025
Dec 11న మిస్సైల్ టెస్ట్.. NOTAMకు కేంద్రం నోటీస్

విశాఖ తీరంలో మిస్సైల్ పరీక్ష పరిధిని 1,050 కి.మీ నుంచి 1,190 కి.మీకు కేంద్రం విస్తరించింది. DEC 11న మిస్సైల్ పరీక్ష నిర్వహించనున్నట్టు NOTAMకు తెలిపింది. డిసెంబర్ 1-4 మధ్య నిర్వహించే టెస్ట్‌కు 3,485 కి.మీలు డేంజర్ జోన్‌గా గుర్తించాలని నోటీసులిచ్చిన కేంద్రం తర్వాత కాన్సిల్ చేసింది. ATC, రన్ వే రిపేర్లు, ఎయిర్‌స్పేస్ క్లోజింగ్స్, విమాన కార్యకలాపాలు, భద్రతా పర్యవేక్షణలో NOTAMs కీలకంగా పనిచేస్తాయి.


