News May 22, 2024
ఎమ్మెల్సీ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి: CM

TG: ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. తమ పరిధిలోని అన్ని బూత్‌లను ఎమ్మెల్యేలు సందర్శించాలని, కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని దిశానిర్దేశం చేశారు. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తీన్మార్ మల్లన్న ప్రభుత్వానికి వారధిగా పని చేస్తారని రేవంత్ రెడ్డి తెలిపారు.
Similar News
News November 29, 2025
NZB: GPఎన్నికల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సమక్షంలో శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించారు. స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని, ర్యాండమైజేషన్ ద్వారా స్థానికేతర సిబ్బందిని పోలింగ్ విధుల కోసం ఎంపిక చేశారు.

దిత్వా తుఫాన్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఈ ప్రభావం నంద్యాల జిల్లాలో అధికంగా ఉండే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ రాజకుమారి శుక్రవారం తెలిపారు. శనివారం, ఆదివారం, సోమవారం 3రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.