News May 27, 2024
నేడే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

TG: ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల MLC ఉప ఎన్నిక నేడు జరగనుంది. 34 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4.63 లక్షలమంది గ్రాడ్యుయేట్లు ఓటు వేయనున్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లను ఈసీ పూర్తి చేసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిపి 52మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, BRS నుంచి రాకేశ్ రెడ్డి, BJP అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి పోటీలో చేస్తున్నారు.
Similar News
News January 13, 2026
రాహుల్ విపక్ష నేత కాదు పర్యాటక నేత: షెహజాద్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ‘ఆయన ఎప్పుడూ సెలవుల మూడ్ లోనే ఉంటారు. కీలకమైన జాతీయ సమస్యల సమయంలోనూ విదేశాల్లోనే గడుపుతారు. ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు, పర్యాటక నాయకుడు’ అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఎద్దేవా చేశారు. రాహుల్ అపరిపక్వ నాయకుడని విమర్శించారు. కాగా వియత్నాం పర్యటనకు సంబంధించి రాహుల్ గాంధీ, INC ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
News January 13, 2026
PSLV-C62 విఫలం.. అయినా పని చేసింది!

ఇస్రో చేపట్టిన PSLV-C62 ప్రయోగం <<18833915>>విఫలమైన<<>> విషయం తెలిసిందే. అయితే ఆశ్చర్యకరంగా అందులో నుంచి ఓ ఉపగ్రహం వేరుపడి, పని చేసింది. తమ కెస్ట్రెల్ ఇనీషియల్ డెమోన్స్ట్రేటర్ (KID) క్యాప్సుల్ 3 నిమిషాల కీలక డేటాను పంపిందని స్పానిష్ స్టార్టప్ ‘ఆర్బిటల్ పారాడిజం’ ప్రకటించింది. ఫుట్బాల్ సైజులో ఉన్న 25 కిలోల క్యాప్సుల్ PSLV స్టేజ్-4లో విజయవంతంగా సపరేట్ అయింది. నిజానికి మూడో దశలోనే రాకెట్ <<18834317>>విఫలమవ్వడం<<>> గమనార్హం.
News January 13, 2026
ఫ్రెషర్లకు ₹18-22 లక్షల ప్యాకేజీ

HCLTech ఫ్రెషర్ల వేతనాల్లో భారీ పెంపును ప్రకటించింది. AI, సైబర్ సెక్యూరిటీ వంటి నైపుణ్యాలున్న ఇంజినీర్లను ‘ఎలైట్ క్యాడర్’గా పరిగణిస్తూ వారికి ఏడాదికి ₹18-22 లక్షల వరకు ప్యాకేజీలను ఆఫర్ చేస్తోంది. సాధారణ ఫ్రెషర్ల వేతనం కంటే ఇది 3-4 రెట్లు ఎక్కువ. HCLTech మాత్రమే కాకుండా ఇన్ఫోసిస్ కూడా నైపుణ్యం కలిగిన ఫ్రెషర్లకు ₹21 లక్షల వరకు అందిస్తోంది. ఈ ఏడాది HCLTech ఇప్పటికే 10,032 మంది ఫ్రెషర్లను తీసుకుంది.


