News March 4, 2025

ఎమ్మెల్సీ కౌంటింగ్: రసవత్తర పోటీ

image

TG: కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా సాగుతోంది. మొదటి రౌండ్ పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 6712, నరేందర్ రెడ్డి (కాంగ్రెస్) 6676, ప్రసన్న హరికృష్ణ 5867, రవీందర్ సింగ్‌ 107, మహమ్మద్ ముస్తాక్ అలీకి 156 ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రెండో రౌండ్ లెక్కింపు ప్రారంభమైందన్నారు.

Similar News

News April 7, 2026

ఇండక్షన్ స్టవ్‌లపై కేంద్రం కీలక నిర్ణయం

image

ఇండక్షన్ స్టవ్‌లకు జులై 1 నుంచి అమలు కావాల్సిన స్టార్ రేటింగ్ నిబంధనను కేంద్ర ప్రభుత్వం 6 నెలల పాటు వాయిదా వేసింది. దేశంలో ప్రస్తుతం ఉన్న వంటగ్యాస్ కొరత దృష్ట్యా ప్రజలు ఇండక్షన్ స్టవ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. కొత్త నిబంధనల వల్ల మార్కెట్లోకి స్టవ్‌లు రావడం ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నిబంధనలు ఇప్పుడు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

News April 7, 2026

19 ఏళ్లకే తొలి లవ్ బ్రేకప్: అడివి శేష్

image

తనకు లవ్ బ్రేకప్ కథలంటే ఇష్టమని అడివి శేష్ తెలిపారు. ‘డెకాయిట్’ ప్రమోషన్లలో మాట్లాడుతూ ‘19 ఏళ్లకే తొలిసారి ప్రేమలో విఫలమయ్యా. దాని నుంచి కోలుకోవడానికి పదేళ్లు పట్టింది. ఆ ఫీలింగ్‌ను ఈ మూవీలో హరి పాత్ర ద్వారా చూపే ప్రయత్నం చేశా. నా ప్రతి కథలోనూ బ్రేకప్ ప్రభావం కొంతైనా ఉంటుంది. నేను సిగరెట్స్, మందు, నాన్ వెజ్ తీసుకోను. అందుకే ఇప్పటికీ ఒకేలా ఉన్నా’ అని చెప్పారు. కాగా ఈ చిత్రం APR 10న విడుదల కానుంది.

News April 7, 2026

US దళాలు యురేనియం దొంగిలించడానికే వచ్చాయి: ఇరాన్

image

F-15E పైలట్‌ను రక్షించే సాకుతో అమెరికా తమ దేశంలోని యురేనియం నిల్వలను దొంగిలించడానికి యత్నించిందని ఇరాన్ సంచలన ఆరోపణలు చేసింది. రెస్క్యూ పేరుతో వచ్చిన US దళాలు అణు నిల్వలున్న ప్రాంతంపై కన్నేశాయని పేర్కొంది. అయితే ఈ ఆపరేషన్‌ను తాము సమర్థంగా తిప్పికొట్టామని, అమెరికా విమానాలను ధ్వంసం చేశామని ఇరాన్ ప్రతినిధి వెల్లడించారు. మరోవైపు తమ సైనికుడిని సేఫ్‌గా తీసుకొచ్చామని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.