News March 4, 2025
MLC కౌంటింగ్: ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి

TG: ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 1,492 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్ పూర్తయ్యేసరికి అంజిరెడ్డికి 14,690 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 13,198, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ 10,746 ఓట్లు సాధించారు.
Similar News
News March 4, 2025
ఇంటర్ పరీక్షలు రాసేవారికి అలర్ట్

TG: రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉ.9 నుంచి మ.12 వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. తప్పనిసరి పరిస్థితుల్లో 5 ని.లు ఆలస్యమైనా అనుమతిస్తామని అధికారులు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల అడ్రస్ విషయంలో గందరగోళానికి గురికాకుండా హాల్టికెట్లపై QR కోడ్ ముద్రించామని తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే 9240205555కు కాల్ చేయాలని సూచించారు. 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
*ALL THE BEST STUDENTS
News March 4, 2025
రెడ్ బుక్ తన పని చేసుకుంటూ వెళ్తోంది: లోకేశ్

TDP కార్యకర్తలు, ప్రజలను ఇబ్బంది పెట్టిన ఎవ్వరినీ వదలబోమని మంత్రి లోకేశ్ హెచ్చరించారు. ఎక్కడికి వెళ్లినా తనను రెడ్ బుక్ గురించి అడుగుతున్నారని, రెడ్ బుక్ తన పని అది చేసుకుంటూ వెళ్తోందన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టనని గతంలోనే తాను చెప్పినట్లు వెల్లడించారు. ఎవరినైనా వదిలిపెడతాననే డౌట్ అక్కర్లేదన్నారు. దేశంలోనే ఏ పార్టీకి లేని బలం TDPకి ఉందని, కార్యకర్తలే పార్టీకి బలమన్నారు.
News March 4, 2025
రోహిత్, గిల్ ఔట్

ఛాంపియన్స్ ట్రోఫీ: టీమ్ ఇండియాకు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్లు రోహిత్(28), గిల్ (8) ఔటయ్యారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 43/2గా ఉంది. విరాట్ (5*), శ్రేయస్ అయ్యర్ (0*) క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి 42 ఓవర్లలో 222 రన్స్ కావాలి.