News May 17, 2024

ఎమ్మెల్సీ దండె విఠల్‌కు సుప్రీంకోర్టులో ఊరట

image

BRS MLC దండె విఠల్ ఎన్నిక చెల్లదంటూ TS హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి విచారణను జులైకి వాయిదా వేసింది. 2022లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల MLCగా విఠల్ ఎన్నికయ్యారు. అయితే ఫోర్జరీ సంతకాలతో తన పేరిట నామినేషన్ ఉపసంహరణ పత్రాలు సమర్పించారని, విఠల్ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ అభ్యర్థి రాజేశ్వర్ హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న HC విఠల్ ఎన్నికల చెల్లదని ఇటీవల తీర్పునిచ్చింది.

Similar News

News December 22, 2024

టోల్ వసూలు చేస్తూనే ఉంటామంటే కుదరదు: సుప్రీం

image

ఇష్టమొచ్చినంత కాలం టోల్ వసూలు చేసుకోవడం నిరంకుశత్వమేనని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. ‘టోల్ వసూలు శాశ్వతం కాదు. ప్రాజెక్టులనేవి ప్రజల కోసమే తప్ప ప్రైవేటు సంస్థల లాభార్జన కోసం కాదు. ప్రజలపై అన్యాయంగా భారం మోపడం ఆమోదయోగ్యం కాదు’ అని పేర్కొంది. ఢిల్లీ-నోయిడా ఫ్లైవే టోల్ రుసుము ఒప్పందాన్ని అలహాబాద్ హైకోర్టు కొట్టివేయడాన్ని నిర్మాణ సంస్థ సుప్రీంలో సవాలు చేయగా ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది.

News December 22, 2024

రేవంత్ రెడ్డి Vs అల్లు అర్జున్

image

ఇప్పుడు అంతటా రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ గురించే చర్చ జరుగుతోంది. సంధ్య థియేటర్‌ తొక్కిసలాటను ప్రస్తావిస్తూ బన్నీపై రేవంత్ నిన్న అసెంబ్లీలో <<14942545>>ఫైర్<<>> అయ్యారు. దీనిపై వెంటనే స్పందించిన అర్జున్ ప్రెస్‌మీట్ పెడుతున్నట్లు ప్రకటించారు. రా.8 గంటలకు మీడియా ముందుకొచ్చి CM వ్యాఖ్యలు <<14946087>>సరికాదన్నారు<<>>. దీంతో INC, బన్నీ ఫ్యాన్స్ వారి వీడియోలు SMలో షేర్ చేస్తూ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.

News December 22, 2024

మెగాస్టార్ తర్వాతి సినిమా తమిళ డైరెక్టర్‌తో?

image

మెగాస్టార్ చిరంజీవి వరుసగా యువ దర్శకులకు అవకాశాలిస్తున్నారు. వశిష్టతో ‘విశ్వంభర’ రెడీ అవుతుండగా శ్రీకాంత్ ఓదెలతో మూవీకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనిల్ రావిపూడితోనూ ఓ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది. వీరి తర్వాత తమిళ దర్శకుడు మిత్రన్‌తో మూవీ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆయన కార్తీతో ‘సర్దార్’ సినిమాను తీశారు. మిత్రన్ చెప్పిన స్టోరీ లైన్ చిరుకు నచ్చిందని, పూర్తి కథను డెవలప్ చేయమని సూచించారని సమాచారం.