News February 25, 2025
నేటితో ముగియనున్న MLC ఎన్నికల ప్రచారం

TG: రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం ముగియనుంది. అసెంబ్లీ ఎలక్షన్స్‌ను తలపించేలా నెల రోజుల నుంచి జోరుగా ప్రచారం సాగింది. కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ జిల్లాల టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు, నల్గొండ-ఖమ్మం-వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఈనెల 27న పోలింగ్ జరగనుంది.
Similar News
News February 25, 2025
ఐసీసీ ట్రోఫీలు: రోహిత్ మరో టైటిల్ సాధిస్తారా?

ఐసీసీ టోర్నమెంట్లలో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ రికార్డు కంటిన్యూ అవుతోంది. రోహిత్ నాయకత్వంలో టీమ్ ఇండియా గత 5 ట్రోఫీల్లో సెమీఫైనల్స్‌కు వెళ్లింది. 2022 టీ20 WCలో సెమీస్, 2021-23 WTC రన్నరప్, 2023 వన్డే WCలో రన్నరప్, 2024 టీ20 WCలో విజయం, తాజాగా 2025 CTలో సెమీఫైనల్స్ చేరింది. మరి రోహిత్ మరో ఐసీసీ కప్పు కొడతారా? కామెంట్ చేయండి.
News February 25, 2025
పెట్రోల్ బంకుల్లో మోసాలు.. DGP హెచ్చరిక

AP: ఎలక్ట్రానిక్ చిప్‌లు టాంపర్ చేసి రాష్ట్రంలోని పలు పెట్రోల్ బంకులు మోసం చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. రాజమహేంద్రవరం, ఏలూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని 73 పెట్రోల్ బంకుల్లో తనిఖీలు చేసి పలు చోట్ల వాహనాలకు తక్కువ పెట్రోల్, డీజిల్ కొడుతున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని DGP హరీశ్ కుమార్ గుప్తా హెచ్చరించారు.
News February 25, 2025
వైసీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం

AP: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2వ రోజు ప్రారంభం కాగానే స్పీకర్ అయ్యన్నపాత్రుడు నిన్నటి YCP సభ్యుల ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగిస్తుంటే ఆందోళనకు దిగడం, ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేయడం సరికాదన్నారు. MLAలు ఎవరైనా ప్రజాస్వామ్య విలువలు పాటించాలని కోరారు. గవర్నర్ ప్రసంగంపై అభ్యంతరాలు ఉంటే మాట్లాడటానికి ఇవాళ అవకాశం ఉన్నా, ఇష్టారీతిన ప్రవర్తించిన తీరు ఆమోదయోగ్యం కాదన్నారు.