News March 4, 2025
MLC ఎన్నికల కోడ్ ఎత్తివేత

AP: ఉమ్మడి గుంటూరు- కృష్ణా, ఉభయగోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఎత్తేశారు. ఈ మేరకు ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ ప్రకటన జారీ చేశారు. దీంతో గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, మన్యం, అనకాపల్లి జిల్లాల్లో ఆంక్షలను ఎత్తివేయనున్నారు. గత నెల 3నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే.
Similar News
News December 21, 2025
RTCలో ఉచిత ప్రయాణానికి స్పెషల్ కార్డులు: భట్టి

TG: మహాలక్ష్మి స్కీమ్తో RTC లాభాల్లోకి వచ్చిందని, ఇప్పటివరకు 255 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగినట్లు Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. మహిళల కోసం స్పెషల్ కార్డులు ఇస్తామన్నారు. నిజామాబాద్, వరంగల్కు 100 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నట్లు వెల్లడించారు. స్కూల్స్ తెరిచేసరికి బుక్స్, యూనిఫామ్స్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నాయీబ్రాహ్మణ, రజకుల ఫ్రీ కరెంట్ బకాయిలు ఉండొద్దని సూచించారు.
News December 21, 2025
టైర్లు నలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి?

నేచురల్ రబ్బర్ నిజానికి తెల్లగా ఉంటుంది. కానీ వాహనాల టైర్లు నలుపు తప్ప మరో రంగులో కనిపించవు. దానికి ప్రధాన కారణం Carbon Black. దీన్ని రబ్బరుకు కలపడం వల్ల అది నల్లగా మారుతుంది. ఇది టైరుకు మంచి గ్రిప్ ఇస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే UV Rays తగలకుండా కాపాడుతుంది. దీనివల్ల టైర్లు త్వరగా అరిగిపోకుండా ఎక్కువ కాలం మన్నిక ఇస్తాయి.
News December 21, 2025
బర్త్డే విషెస్.. థాంక్స్ చెప్పిన జగన్

AP: తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ స్పెషల్ డేను ఉత్సాహంగా నిర్వహించి, YCP కుటుంబం చూపించిన ప్రేమ, అభిమానానికి ఆనందిస్తున్నానని తెలిపారు. వారి మద్దతు తనకు గొప్ప బలాన్ని ఇస్తుందన్నారు. CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్, AP గవర్నర్ అబ్దుల్ నజీర్, PCC చీఫ్ షర్మిల, TG Dy.CM భట్టిని ట్యాగ్ చేస్తూ ధన్యవాదాలు చెప్పారు.


