News March 2, 2025
MLC ఎన్నికల కౌంటింగ్ ఇలా(1/2)

MLA, MP ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థిదే విజయం. కానీ గ్రాడ్యుయేట్, టీచర్ MLC ఎన్నిక ప్రత్యేకం. ఓటరు తమ మొదటి, రెండో, మూడో ప్రాధాన్యత ఓట్లు వేస్తారు. చెల్లుబాటయ్యే ఓట్లలో 50% పైగా ఓట్లు సాధించిన వ్యక్తే విజేత. EX: పోలైన 6K ఓట్లలో 4K ఓట్లు చెల్లుబాటైతే 2,001 ఓట్లు సాధించిన వ్యక్తి విజేత. అభ్యర్థులెవరికీ ఈ స్థాయి ఓట్లు రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తూ ఎలిమినేషన్ చేస్తారు.
Similar News
News October 22, 2025
హీరో నారా రోహిత్ పెళ్లి తేదీ ఫిక్స్.. నాలుగు రోజులు వేడుకలు!

టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. నటి, ప్రియురాలైన శిరీషను ఈనెల 30న రోహిత్ పెళ్లి చేసుకోబోతున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈనెల 25న హల్దీ వేడుకతో పెళ్లి వేడుకలు మొదలు కానున్నాయి. 26న పెళ్లి కొడుకు వేడుక, 28న మెహందీ, 30న రాత్రి 10.35 గంటలకు హైదరాబాద్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం జరగనుంది.
News October 22, 2025
UPI ధమాకా.. రోజూ ₹94 వేల కోట్ల చెల్లింపులు

పండుగ సీజన్లో భారీ స్థాయిలో యూపీఐ పేమెంట్స్ జరిగాయి. ఈ నెలలో రోజూ సగటున రూ.94 వేల కోట్ల లావాదేవీలు నమోదైనట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) డేటా వెల్లడించింది. సెప్టెంబర్‌తో పోలిస్తే ఇది 13 శాతం ఎక్కువని తెలిపింది. ఈ నెలలో ఇంకా వారం రోజులకు పైనే ఉండటంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు దేశంలో డిజిటల్ పేమెంట్స్‌లో 85 శాతం యూపీఐ ద్వారానే జరుగుతుండటం గమనార్హం.
News October 22, 2025
లిక్విడ్ లిప్‌స్టిక్ ఎక్కువసేపు ఉండాలంటే..

ముఖానికి మరింత సౌందర్యం అద్దడానికి చాలామంది మహిళలు లిప్‌స్టిక్ వేసుకుంటారు. అయితే ప్రస్తుతం లిక్విడ్ లిప్‌స్టిక్ ట్రెండ్ అవుతోంది. దీన్ని సరిగా వాడకపోతే ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. ముందు లిప్‌లైనర్‌తో పెదాల చుట్టూ లైనింగ్ చేయండి. తర్వాత లిక్విడ్ లిప్‌స్టిక్‌ను అప్లై చేసి ఆరనివ్వాలి. లిప్‌స్టిక్ మరీ ఎక్కువగా ఉందనిపిస్తే ఓ టిష్యూతో పెదాలను అద్దాలి. ఇలా చేస్తే లిప్‌స్టిక్ ఎక్కువసేపు ఉంటుంది.