News July 26, 2024

ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు 29న నోటిఫికేషన్

image

AP: ఉభయ గోదావరి టీచర్స్, గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ ఓటర్ల రిజిస్ట్రేషన్‌కు EC ఈ నెల 29న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నవంబర్ 1 నాటికి ఓటర్ల జాబితా రూపొందించనుంది. శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ టీచర్ సెగ్మెంట్, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు SEP 30న నోటీస్ వెలువడనుంది. ఆయా సెగ్మెంట్ల MLCలు వెంకటేశ్వరరావు, లక్ష్మణరావు, రఘువర్మ పదవీకాలం 2025 MAR 29తో ముగియనుంది.

Similar News

News November 26, 2025

HYD: బీసీ రిజర్వేషన్లపై రాహుల్ గాంధీని ప్రశ్నించిన KTR

image

తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శమని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ ‘X’ లో ఘాటుగా స్పందించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని, రూ.160 కోట్లు ఖర్చు చేశామని చెప్పిన రాహుల్ గాంధీ, పంచాయతీ ఎన్నికల్లో కేవలం 17% రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని KTR ప్రశ్నించారు.

News November 26, 2025

బాలిస్టిక్ క్షిపణి పరీక్షించిన పాకిస్థాన్

image

యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాకిస్థాన్ మిలిటరీ ప్రకటించింది. ‘స్థానికంగా నిర్మించిన నేవల్ ప్లాట్‌ఫామ్ నుంచి మిస్సైల్ పరీక్షించాం. సముద్రం, భూమిపై ఉన్న లక్ష్యాలను ఇది అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. ఇందులో అత్యాధునిక గైడెన్స్ వ్యవస్థలు ఉన్నాయి’ అని పేర్కొంది. కాగా మే నెలలో భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాతి నుంచి పాకిస్థాన్ ఈ తరహా ప్రయోగాలను పెంచింది.

News November 26, 2025

పుల్లోరం వ్యాధితో కోళ్లకు ప్రమాదం

image

వైరస్, సూక్ష్మజీవుల వల్ల కోళ్లలో పుల్లోరం వ్యాధి సోకుతుంది. కోడి పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువ. తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన కోడిపిల్లలు గుంపులుగా గుమికూడటం, శ్వాసలో ఇబ్బంది, రెక్కలు వాల్చడం, మలద్వారం వద్ద తెల్లని రెట్ట అంటుకోవడం వంటి లక్షణాలుంటాయి. కోడిని కోసి చూస్తే గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు వెటర్నరీ డాక్టర్ సలహాలను పాటించాలి.