News March 25, 2025
MLC Elections: ఏ పార్టీకి ఎన్ని ఓట్లు ఉన్నాయంటే..!

హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (ఏప్రిల్ 23) 116 మంది (కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో మెంబర్లు) తమ ఓటు హక్కును వినియోగించకోనున్నారు. ఎంఐఎంకు 49 ఓట్లు ఉండగా కాంగ్రెస్ పార్టీకి 13 ఉన్నాయి. ఇక బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు 54 మంది ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ 59 ఓట్ల కంటే ఎక్కువ వస్తే వారే విజయం సాధిస్తారు. ఎక్స్ అఫిషియో మెంబర్లుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఉంటారు.
Similar News
News March 31, 2025
HYD: ఎన్నికల్లో BJP 100% పోటీ: బండి సంజయ్

జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఈ మూడు పార్టీలు ఓటింగ్‌లో కుట్ర పన్నుతున్నాయని తెలిపారు. మజ్లిస్ అభ్యర్థిని గెలిపించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ చేయడం లేదని, తెలంగాణ ప్రజలు ఈ రాజకీయ సమీకరణాన్ని గమనించాలని సూచించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 100% పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.
News March 31, 2025
HYD: తల్లితో సంబంధం.. పొడిచి చంపిన కొడుకు

కర్మన్‌ఘాట్‌లో దారుణఘటన వెలుగుచూసింది. జానకి ఎన్‌క్లేవ్‌లో హత్య జరిగింది. స్థానికుల వివరాలు.. వెంకటేశ్వర్లుకు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. గత 8 నెలలుగా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. సదరు మహిళ కుమారుడు పవన్‌కు వెంకటేశ్వర్లు మధ్య గత రాత్రి గొడవ జరిగింది. కోపంతో కత్తితో పొడిచిన పవన్ పరారీ అయ్యాడు. బాధితుడిని ఉస్మానియాకు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
News March 31, 2025
OU దూర విద్యలో ప్రవేశాలకు రేపు లాస్ట్ డేట్

ఓయూ దూరవిద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్(పీజీఆర్ఆర్సీడీఈ)లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫేజ్-2 కింద UG, PG, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఇప్పటికే ప్రారంభమైన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ గడువు రేపటితో ముగియనుంది. అర్హులైన వారు మార్చి 31లోగా అప్లికేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.