News February 14, 2025
MLC ఎలక్షన్స్: బరిలో 90 మంది

TG: ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 3 స్థానాలకు మొత్తం 90 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ గ్రాడ్యుయేట్ స్థానానికి 56 మంది, టీచర్స్ స్థానానికి 15, వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది పోటీలో ఉన్నారు. ఈనెల 27న పోలింగ్ జరగనుంది.
Similar News
News January 21, 2026
పురుగు మందుల నాణ్యత, పంపిణీపై కేంద్రానికి సర్వాధికారాలు

ప్రస్తుతం అమలులో ఉన్న 1968, 1971 చట్ట నిబంధనల్లోని లోపాలను సవరించడం ఈ కొత్త చట్టం ప్రధాన ఉద్దేశం. ఇది అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా పురుగు మందుల నాణ్యత, పంపిణీ అధికారాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తాయి. నకిలీ మందుల నిరోధం, స్వదేశీ తయారీ ప్రోత్సాహం, జీవ పురుగు మందుల వినియోగం పెంచడం కేంద్రం లక్ష్యం. ప్రతీ పురుగు మందును పూర్తిగా పరీక్షించిన తర్వాతే మార్కెట్లోకి అనుమతిస్తారు.
News January 21, 2026
నేటి నుంచి జేఈఈ మెయిన్స్.. అరగంట ముందే గేట్స్ క్లోజ్

నేటి నుంచి JEE మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నేడు, రేపు, ఎల్లుండి, ఈ నెల 24, 28 తేదీల్లో పేపర్-1, 29న పేపర్-2 పరీక్ష జరగనుంది. రోజు ఉ.9-12 గం. వరకు షిఫ్ట్-1, మ.3-6 వరకు షిఫ్ట్-2లో CBT పద్ధతిలో పరీక్షలు జరుగుతాయి. ఎగ్జామ్‌కు అరగంట ముందే గేట్లు క్లోజ్ చేస్తారు. దేశవ్యాప్తంగా 14 లక్షల మంది, తెలుగు రాష్ట్రాల నుంచి 1.5 లక్షల మంది హాజరుకానున్నారు. ఫోన్లు, వాచులు, ఇయర్ ఫోన్లకు పర్మిషన్ లేదు.
News January 21, 2026
నాలుగోసారి తండ్రి కాబోతున్న JD వాన్స్

అమెరికా వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్-ఉష దంపతులు మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వాన్స్ ప్రకటించారు. ‘ఉష మా నాలుగో బిడ్డకు జన్మనివ్వబోతోంది. మా బాబు జులైలో పుట్టబోతున్నాడు. ఈ సంతోష సమయంలో మా ఫ్యామిలీ, దేశం కోసం కష్టపడుతున్న సిబ్బందికి, సేవలందిస్తున్న మిలిటరీ డాక్టర్లకు ధన్యవాదాలు’ అని తెలిపారు. లా స్కూల్లో వీళ్ల మధ్య పరిచయం ఏర్పడింది. వీళ్లిద్దరూ 2014లో పెళ్లిచేసుకున్నారు.


