News February 24, 2025
MLC ఎన్నికలు.. ఇవాళ సీఎం రేవంత్ ప్రచారం

TG: ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న CM రేవంత్ రెడ్డి ఇవాళ 3 జిల్లాల్లో ప్రచారం చేయనున్నారు. NZB, ADB, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో INC తరఫున నరేందర్ బరిలో ఉన్నారు. దీంతో ఆయన తరఫున రేవంత్ ఉదయం 11.30 గంటలకు HYD నుంచి NZB చేరుకొని ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మ. 2 గంటలకు మంచిర్యాలలో, సాయంత్రం 4 గంటలకు కరీంనగర్లో పట్టభద్రుల ఓట్లు అభ్యర్థిస్తారు.
Similar News
News February 24, 2025
నేడు KRMB ప్రత్యేక భేటీ

ఇవాళ కృష్ణానది యాజమాన్య బోర్డు(KRMB) ప్రత్యేక సమావేశం కానుంది. మధ్యాహ్నం మూడున్నర గంటలకు తెలుగు రాష్ట్రాల నీటి వాటాలు, ఇతర అంశాలపై అధికారులు KRMB ఛైర్మన్ అతుల్ జైన్తో చర్చించనున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి ఏపీ అక్రమంగా జలాలను తరలిస్తోందని తెలంగాణ నేతలు వాదిస్తున్నారు. ఈ నెల 21నే సమావేశం జరగాల్సి ఉండగా ఏపీ విజ్ఞప్తితో నేటికి వాయిదా పడింది.
News February 24, 2025
పరీక్ష లేకుండానే ఉద్యోగాలు

దేశవ్యాప్తంగా 21,413 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీలో 1,215, TGలో 519 ఖాళీలు ఉన్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా టెన్త్ మార్కుల మెరిట్ లిస్ట్ ఆధారంగా భర్తీ చేయనున్నారు. బీపీఎం శాలరీ నెలకు రూ.12,000-రూ.29,380, డాక్ సేవక్ జీతం రూ.10,000-రూ.24,470 వరకు ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 3.
వెబ్ సైట్: indiapostgdsonline.gov.in
News February 24, 2025
కివీస్ గెలిస్తే పాకిస్థాన్ ఔట్!

ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-ఎలో న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. కివీస్ ఇప్పటికే ఒక మ్యాచ్ గెలవగా, బంగ్లా ఒకటి ఓడిపోయింది. న్యూజిలాండ్ ఈ గేమ్ గెలిస్తే సెమీస్ బెర్తులు తేలిపోనున్నాయి. ఆ జట్టుతో పాటు ఇండియా చెరో 4 పాయింట్లతో సెమీస్ చేరుకుంటాయి. పాకిస్థాన్, బంగ్లా ఇంటిదారి పడతాయి. కివీస్ ఓడితే ఆ రెండు జట్లు సెమీస్ రేసులో నిలుస్తాయి.