News September 15, 2024
MLC ఎలక్షన్స్.. ఓటరు నమోదుకు షెడ్యూల్ విడుదల

AP: కృష్ణా-గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే ఏడాది మార్చిలో జరగనున్నాయి. ఇందుకోసం ఓటరు నమోదుకు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 30 నుంచి NOV 6 వరకు అవకాశం కల్పించారు. ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఎన్నికలు జరిగే నియోజకవర్గాల పరిధిలో నివసించే వారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదుచేసుకోవచ్చు. ప్రొవిజినల్, ఆధార్, ఓటర్ ఐడీ సమర్పించాల్సి ఉంటుంది.
Similar News
News October 17, 2025
రేపే బంద్.. డీజీపీ హెచ్చరికలు

TG: రేపు బంద్ పేరిట అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని DGP శివధర్ రెడ్డి హెచ్చరించారు. పోలీసులు, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయన్నారు. బంద్ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా రేపు రాష్ట్రవ్యాప్తంగా BC సంఘాల నేతలు బంద్ చేపట్టనున్నారు. దీనికి INC, BRS, BJP, CPI, CPM సహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి.
News October 17, 2025
రాహుల్ గాంధీపై అమెరికన్ సింగర్ సెటైర్లు

ట్రంప్‌కు PM మోదీ భయపడుతున్నారంటూ LoP రాహుల్ గాంధీ చేసిన <<18020106>>విమర్శలపై<<>> US సింగర్, నటి మేరీ మిల్బెన్ సెటైర్లు వేశారు. ‘రాహుల్ మీరు రాంగ్. ట్రంప్‌కు PM మోదీ భయపడటం లేదు. ఆయనకు ఈ లాంగ్ గేమ్‌పై అవగాహన ఉంది. USతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ట్రంప్ లాగే మోదీ కూడా తమ దేశానికి ఏది ముఖ్యమో అదే చేస్తున్నారు. దేశాధినేతలు అలాగే చేస్తారు. ఇది మీకు అర్థం కాదు. మీకు PM అయ్యేంత చతురత లేదు’ అని ట్వీట్ చేశారు.
News October 17, 2025
TET, DSC అర్హతలు, ఇతర నిబంధనల్లో మార్పు!

AP: 2వేల టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యాశాఖ ఆ దిశగా కసరత్తు చేపట్టింది. DECలో టెట్, ఆపై JANలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆలోచిస్తోంది. ప్రతీసారి వీటికి లీగల్ ఇష్యూస్ వస్తుండడంతో వాటిపై దృష్టి పెట్టారు. నిపుణులతో చర్చించి అర్హతలు ఇతర నిబంధనల్లో మార్పులు చేయాలని భావిస్తున్నారు. ఇటీవలి DSCలో 16317 పోస్టుల్లో 15941 భర్తీ అయ్యాయి. మిగిలిన వాటితో పాటు ఇతర ఖాళీలు భర్తీ చేస్తారు.