News June 3, 2024

ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు

image

AP: ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు అనర్హత వేటు వేశారు. పార్టీ ఫిరాయించిన కారణంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని వైసీపీ విప్ విక్రాంత్ ఫిర్యాదు చేయగా, దీనిపై రఘురాజును మండలి ఛైర్మన్ వివరణ కోరారు. ఆయన విచారణకు రాకపోవడంతో వేటు వేశారు.

Similar News

News October 10, 2024

మోపిదేవి పార్టీ మారడం బాధాకరం: జగన్

image

AP: రేపల్లె నియోజకవర్గ నేత మోపిదేవి వెంకట రమణ పార్టీ వీడటంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఆయన విషయంలో ఏనాడు తప్పు చేయలేదని, మోపిదేవి పార్టీ మారడం బాధాకరమని అన్నారు. మండలి రద్దు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు మోపిదేవిని రాజ్యసభకు పంపామని గుర్తు చేశారు. రాజకీయాల్లో కష్టాలు శాశ్వతం కాదని అన్నారు. తనను జైల్లో పెట్టినా ప్రజల ఆశీర్వాదంతో సీఎం అయ్యానని వ్యాఖ్యానించారు. దేవుడు మంచివైపు ఉంటాడని చెప్పారు.

News October 10, 2024

సైలెంట్‌గా ఉన్నందుకు క్షమించండి: షకీబ్

image

బంగ్లా మాజీ PM హసీనాకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు తాను మద్దతుగా నిలవనందుకు క్షమించాలని ఆ దేశ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ ఫ్యాన్స్‌ను కోరారు. ఈ నెల 21న ఢాకాలో సౌతాఫ్రికాతో జరిగే తన ఆఖరి టెస్టుకు పెద్ద ఎత్తున రావాలని విజ్ఞప్తి చేశారు. ‘నియంతృత్వ వ్యతిరేక నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు, క్షతగాత్రులకు నా ప్రగాఢ సంతాపం’ అని పేర్కొన్నారు. హసీనా పార్టీ తరఫునే ఆయన ఎంపీ కావడం గమనార్హం.

News October 10, 2024

Q2 ఆదాయంపై ప్రెస్‌మీట్ రద్దు చేసిన TCS

image

రతన్ టాటా కన్నుమూయడంతో తమ ద్వితీయ త్రైమాసిక ఆదాయాన్ని వివరించేందుకు నిర్వహించాల్సిన ప్రెస్‌మీట్‌ను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) రద్దు చేసింది. ఈ రోజు సాయంత్రం ఈ సమావేశం జరగాల్సి ఉండగా, అదే సమయానికి రతన్ అంత్యక్రియలు జరగనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. బోర్డు మీటింగ్ అనంతరం తమ జులై-సెప్టెంబరు పద్దును స్టాక్ ఎక్స్ఛేంజీకి వివరిస్తామని పేర్కొన్నాయి.