News May 16, 2024
ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు

AP: ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు అనర్హత వేటు వేశారు. వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎంపికైన ఆయన ఇటీవల టీడీపీలో చేరారు. దీనిపై వైసీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి శాసనమండలి ఛైర్మన్ మోషేనురాజుకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఛైర్మన్.. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
Similar News
News February 2, 2026
కుప్పకూలిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ మరోసారి బంగారం ధరలు కుప్పకూలాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు ఏకంగా రూ.13,410 తగ్గి రూ.1,47,170కి చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రూ.12,300 తగ్గి రూ.1,34,900 పలుకుతోంది. ఇక కేజీ వెండి ధర రూ.20వేలు పడిపోయి రూ.3 లక్షల వద్ద కొనసాగుతోంది.
News February 2, 2026
మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు

TG: మున్సి‘పోల్స్’లో పోటీచేసే పార్టీ అభ్యర్థులను PCC ఖరారు చేసింది. స్క్రీనింగ్ కమిటీ సిఫారసు మేరకు అభ్యర్థుల జాబితాను ఆమోదించింది. కొద్దిసేపట్లో దీన్ని అధికారికంగా ప్రకటించనుంది. పార్టీ నిర్ణయించిన వారికే B ఫారాలు అందిస్తారు. విత్‌డ్రా గడువులోగా వీటిని అధికారులకు సమర్పించాలి. కాగా PCC చీఫ్ మహేశ్ కుమార్ అధ్యక్షతన ఎన్నికల కమిటీ జూమ్ సమావేశం జరిగింది. CM, పార్టీ ఇన్‌ఛార్జ్, ఇతర నేతలు పాల్గొన్నారు.
News February 2, 2026
పాక్ జట్టుకు ఇదేం కొత్త కాదు: సునీల్ గవాస్కర్

T20 WCలో భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించడంపై సునీల్ గవాస్కర్ తనదైన శైలిలో స్పందించారు. ‘ముందు ఓ నిర్ణయం తీసుకొని మళ్లీ దాన్ని మార్చుకోవడం పాక్ క్రికెటర్లకు అలవాటే. వారిది యూటర్న్‌ల చరిత్ర. రిటైర్మెంట్ ప్రకటించిన నాలుగు రోజులకే మళ్లీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారు. కాబట్టి 15వ తేదీలోపు బాయ్‌కాట్ నిర్ణయంపై కూడా వారు వెనక్కి తగ్గొచ్చు’ అని అభిప్రాయపడ్డారు.


