News July 20, 2024
10 కిలోల బరువు తగ్గిన ఎమ్మెల్సీ కవిత?

తిహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత 4 నెలల్లో 10 కిలోల బరువు తగ్గినట్లు సమాచారం. కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు నిన్న ఆమెను ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె భర్త సమక్షంలో వైద్య పరీక్షలు పూర్తి కాగా, ఆమె 10 కేజీల బరువు తగ్గినట్లు తెలిసింది. టెస్టుల అనంతరం ఆమెను తిరిగి జైలుకు తరలించారు. కవితను పరామర్శించేందుకు కేటీఆర్, హరీశ్ రావు ఎల్లుండి ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం.
Similar News
News January 22, 2026
ఎన్కౌంటర్లో 15కు చేరిన మావోయిస్టు మృతుల సంఖ్య

ఝార్ఖండ్ <<18923190>>ఎన్కౌంటర్<<>> ఘటనలో మావోయిస్టు మృతుల సంఖ్య 15కు చేరింది. మృతుల్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు పతిరామ్ మాంఝీ ఉన్నారు. ఆయనపై రూ.5 కోట్ల రివార్డు ఉండడం గమనార్హం. సింగ్భూం జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
News January 22, 2026
ఫ్యూచర్ సిటీలో ఏఐ డేటా సెంటర్.. రూ.5వేల కోట్ల పెట్టుబడి

తెలంగాణను AI డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పెట్టుబడిని సాధించింది. దావోస్‌లో యూపీసీ వోల్ట్ సంస్థతో CM రేవంత్ బృందం MOU కుదుర్చుకుంది. ఈ సంస్థ భారత్ ఫ్యూచర్ సిటీలో 100MW సామర్థ్యంతో AI డేటా సెంటర్‌ను నెలకొల్పనుంది. ఐదేళ్లలో ₹5,000Cr పెట్టుబడి పెట్టనుంది. 100MW సామర్థ్యంతో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 4వేల మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా.
News January 22, 2026
10సెకన్లలో హార్ట్ అటాక్ ముప్పు గుర్తించే సెన్సర్..

హార్ట్ అటాక్ ముప్పును 10సెకన్లలోనే గుర్తించే స్పెషల్ సెన్సర్‌ను బనారస్ హిందూ యూనివర్సిటీ రీసెర్చర్స్ డెవలప్ చేశారు. రక్తంలోని C-రియాక్టివ్ ప్రొటీన్(CRP) లెవెల్స్‌ను వేగంగా, కచ్చితంగా కొలిచే ఇంపెడిమెట్రిక్ సెన్సర్‌ను తయారుచేశారు. మిల్లీలీటరుకు 0.5నానోగ్రామ్స్ ఉన్న CRP లెవెల్స్‌ను కూడా ఈ సెన్సర్ గుర్తిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెస్టులు ప్రీమియంతోపాటు రిజల్ట్ కోసం ఎక్కువ సమయం వేచిఉండాలి.


