News March 22, 2024
ఎమ్మెల్సీ కవిత పిటిషన్.. ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు

TG: ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌లోని అంశాలపై ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. బెయిల్‌పై ట్రయల్ కోర్టుకు వెళ్లాలని కవిత తరఫు న్యాయవాదులకు సూచించింది. బెయిల్ పిటిషన్‌పై జాప్యం లేకుండా విచారణ జరపాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది.
Similar News
News March 3, 2026
IIT బెనారస్‌లో ఉద్యోగాలు

<
News March 3, 2026
ఇరాన్‌లో భూకంపం.. అణుకేంద్రాల దగ్గర అలజడి

ఇరాన్‌లోని గెరాష్ నగర సమీపంలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. 10km లోతులో చోటుచేసుకున్న ఈ ప్రకంపనలు సహజసిద్ధమైనవేనని USGS తెలిపింది. అయితే అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఈ భూకంపం రావడం సర్వత్రా చర్చకు దారితీసింది. గెరాష్‌కు సమీపంలో ఉన్న బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం, గ్చైన్ యురేనియం గనులకు ఎలాంటి నష్టం జరగలేదని సమాచారం. యుద్ధం మధ్యలో ఈ భూకంపం భయాందోళనలను రేకెత్తించింది.
News March 3, 2026
అభివృద్ధి చెందాం.. కానీ, శాంతిని మర్చిపోయాం!

టెక్నాలజీ పెరిగింది. నాగరికత శిఖరాగ్రానికి చేరింది. దౌత్యం గొప్పతనాన్ని చరిత్ర చాటిచెప్పింది. మనం సృష్టించిన ఆయుధాలు మనల్నే మింగేసేంత శక్తిమంతమైనవని తెలిసినా.. రక్తపాతాలు ఆగడం లేదు. నాయకుల ఈగోలు, ఆధిపత్య పోరాటాలు మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. దేశాల ఉనికిని కాపాడాల్సింది పోయి, యుద్ధాలతో వినాశనాన్ని కొనితెచ్చుకోవడం విషాదం. హింసను ఆపి మనిషిని ప్రేమించే స్పృహ పెరగాల్సిన సమయం ఇది.


